వాహనాల పురోగతిలో మరో నూతన అధ్యాయాన్ని ‘క్రాసర్’ (CROSSER) అనే అటానమస్ వెహికల్ రోడ్డుపైనే కాకుండా నీటిపైన (On the water)కూడా ప్రయాణించగలదు.ఇది చూసేందుకు ఓ బాక్స్ మాదిరిగా ఉండే ఈ వాహనం.
నలుగురు ప్రయాణికుల కోసం సౌకర్యవంతంగా డిజైన్ చేయబడింది.ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు, నీటిలోనూ ప్రయాణించగలిగేలా ప్రముఖ డిజైనర్ బెర్నార్డో పెరీరా దీన్ని రూపొందించారు.2024 ఫిబ్రవరిలో ఇది కాన్సెప్ట్ రూపంలో ప్రపంచానికి పరిచయమైంది.ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ వాహనం భవిష్యత్తులో నగర రవాణా తీరుతెన్నులను మార్చే అవకాశముంది.
క్రాసర్ పూర్తిగా ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ వెహికల్(Automatic electric vehicle).ఇందులో రెండు వైపులా సీట్లు ఉంటాయి.ప్రయాణికులకు తగినంత లెగ్‌రూమ్, స్పీకర్లు, ఆటోమేటిక్ డోర్స్ (Legroom, speakers, automatic doors)వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, వాహనాన్ని బుక్ చేసుకున్న వ్యక్తులకు మాత్రమే డోర్లు ఓపెన్ అవుతాయి.
ఇతరులు అనుమతి లేకుండా ప్రవేశించలేరు.

క్రాసర్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.బుక్ చేసుకున్న ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌ను డోర్ మీద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్(LED screen) దగ్గర ఉంచిన వెంటనే డోర్స్ ఓపెన్ అవుతాయి.ఈ వాహనం పూర్తిగా ఆటోమేటిక్ అయినందున దీనికి ప్రత్యేకంగా డ్రైవర్ అవసరం లేదు.
రహదారిపై సురక్షితంగా ప్రయాణించేందుకు కెమెరాలు, సెన్సార్లు ఇందులో అమర్చబడ్డాయి.
ఇక వాహనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సాధారణ కార్ల మాదిరిగా పనిచేస్తుంది.
కానీ, నీటిలోకి వెళ్లాల్సిన అవసరం వస్తే మాత్రం నెమ్మదిగా నీటిలోకి దిగుతుంది.ప్రయాణం సులభంగా సాగేందుకు దాని చక్రాలు 30 డిగ్రీల కోణంలో మార్పు చెందుతాయి.
మళ్లీ రోడ్డుపైకి వెళ్లాల్సిన పరిస్థితిలో, సస్పెన్షన్ రహదారి పరిస్థితిని అనుసరించి మారిపోతుంది.దీని ఫలితంగా రోడ్డుపైనా, నీటిపైనా సమర్థవంతంగా ప్రయాణించగలదు.

క్రాసర్ వాహనం ఆధునిక నగర రవాణాకు విప్లవాత్మక మార్గాన్ని చూపే అవకాశముంది.ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే ఈ వాహనం భవిష్యత్తులో ఎక్కువగా వినియోగంలోకి వచ్చే అవకాశముంది.నగరాల్లో రవాణా సౌకర్యాన్ని మరింత పెంచేందుకు క్రాసర్ వంటి కొత్త ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించనున్నాయి.