సాధారణంగా జలపాతాలు, నదులు, చెరువుల వద్దకు చాలా మంది స్నానానికి వెళ్తుంటారు.అయితే, కొన్ని సందర్భాల్లో నీటిలో ఉండే జలగలు, పురుగులు బట్టలలోకి ప్రవేశించడమే కాకుండా.
ఒక్కోసారి తెలియకుండా మింగినప్పుడు కడుపులోకి కూడా వెళ్లిపోతాయి.తాజాగా, ఇలాంటి భయానకర సంఘటన దక్షిణ కాశ్మీర్‌లో( South Kashmir ) చోటు చేసుకుంది.
అనంత్‌నాగ్ జిల్లాలోని ఎంఎంఏబీఎం అసోసియేటెడ్ ఆసుపత్రిలో ( MMABM Associated Hospital )ఓ బాలుడు ముక్కులో ఏదో కదులుతోందని చెప్పుకుంటూ ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు.ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించారు.

అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించగా అతని ముక్కులో ఏకంగా 10 సెంటీమీటర్ల పొడవుతో ఓ పాములాంటి జీవి కదులుతున్నట్లు గుర్తించారు.వైద్యులు ఎంతో కష్టపడి ఆ జీవిని బయటకు తీశారు.దీన్ని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన ఈ జీవిని మొత్తానికి ఓ జలగగా తేల్చారు.అయితే, బాలుడు గత కొన్ని రోజులుగా అలసటతో బాధపడుతున్నాడని.తిండి కూడా సరిగా తినడం లేదని, బరువు తగ్గిపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే, ఆ జలగ ముక్కులోకి ఎలా వెళ్లింది? ఎంతకాలంగా అతని ముక్కులో ఉంది? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా కొన్ని చోటు చేసుకున్నాయి.అయితే, అసలు ఇవి ముక్కులోకి ఎలా ప్రవేశిస్తాయి? అనే ప్రశ్న ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉంది.నీటి మడుగులు, చెరువులు, నదుల దగ్గర వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా నీరు మింగకుండా చూసుకోవడం, శుభ్రమైన నీటిలోనే స్నానం చేయడం, చిన్న పిల్లలను నీటిలో ఎక్కువ సమయం ఉండకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు అవసరం.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రజలు ఇలాంటి సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.







