ఎండల దెబ్బకు నల్లగా మారిన చర్మాన్ని రిపేర్ చేసే పసుపు.. ఎలా వాడాలంటే?

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఎండల్లో బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తుంది.

ఇక ఒక్క గంట ఎండలో తిరిగాము అంటే సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పటికీ చర్మం ఎంతో కొంత నల్లగా మారుతూనే ఉంటుంది.ఈ సన్ టాన్ సమస్య నుంచి బయటపడడం కోసం చాలా మంది ముప్పతిప్పలు పడుతుంటారు.

కొందరైతే బ్యూటీ పార్లర్ కి వెళ్లి సన్ టాన్ రిమూవింగ్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ ఇంట్లో పైసా ఖర్చు లేకుండా పసుపుతో ఎండల దెబ్బకు నల్లగా మారిన చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.

మరి ఇంతకీ పసుపును ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు పసుపును( Turmeric ) వేసుకోవాలి.

Advertisement

పసుపు కాస్త నలుపు రంగు వచ్చేంతవరకు వేయించాలి.ఆ తర్వాత ఒక టమాటో( Tomato ) ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పసుపును వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసుకొని అన్ని కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు ఇలా టాన్ అయిన ప్రతి చోటా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్ళతో సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఎండల‌ దెబ్బకు నల్లగా మారిన చర్మం చాలా త్వరగా రిపేర్ అవుతుంది.మళ్లీ మీ చర్మం మునుపటి రంగులోకి మారుతుంది.కాబట్టి సన్ టాన్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఎఫెక్టివ్ రెమెడీని పాటించండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది.చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు