దర్శకుడు వీరభద్ర చౌదరి( Veerabhadra Chaudhary ) పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టదు కానీ ఆయన తీసిన సినిమాలను చూస్తే అందరూ అయ్యో ఇతడేనా అని అనుకోకుండా ఉండలేరు.అతని ముద్దుగా వీరభద్రం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.
దర్శకుడిగా మారాలంటే ప్రతి ఒక్కరూ పురుటి నొప్పులు పడినంత ఇబ్బందులు పడాల్సిందే.వీరభద్రం సైతం చాలా ఏళ్లపాటు ఈ బి బి సత్యనారాయణ( BB Satyanarayana ) దగ్గర కో డైరెక్టర్ గా పనిచేశాడు ఆ తర్వాత తేజా దగ్గర మూడు సినిమాలకి, కృష్ణవంశీ దగ్గర ఒక సినిమా, కరుణాకరన్ దగ్గర మరొక సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్ గా అవతారం ఎత్తాడు.
తను చివరి సినిమా కృష్ణవంశీ( Krishna vamsi ) దగ్గర శశిరేఖా పరిణయం కోసం పనిచేసిన సమయంలో దర్శకుడిగా మారాలని కథలను సిద్ధం చేసుకున్నాడు.
అలా చాలామంది హీరోలకి కథలు చెబుతూ ఉన్నాడు తన కెరియర్ మొత్తం మీదుగా ఆహనా పెళ్ళంట పూలరంగడు వంటి రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో నాగార్జున ఆపిలిచి బాయ్ సినిమా చేసే అవకాశం ఇచ్చారు.అది ఫ్లాప్ కావడంతో మళ్లీ మొదటికి వచ్చింది వీరభద్రం పరిస్థితి.ఆ సినిమా తర్వాత ఆది సాయికుమార్ హీరోగా చుట్టాలబ్బాయి అనే సినిమా తీశాడు అది కూడా పరాజయం చవిచూసింది.
ఆ తర్వాత కిరాతక అనే సినిమా 2021 లో దర్శకత్వం వహించాడు.అది కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికి తెలియదు.ఇలా ఆ ఫ్లాపుల పరంపర ప్రస్తుతం వీరభద్రంకి కొనసాగుతుంది.
అయితే అసలు విషయం ఏమిటి అంటే వీరభద్రం ఆహనా పెళ్ళంట( Ahana Pellanta ) సినిమా కథ అంతకు ముందు చాలా మంది హీరోలకు చెప్పాడట.అల్లరి నరేష్ హీరోగా వచ్చిన అహానా పెళ్ళంట చిత్రం వంద రోజులు ఆడింది.ఈ సినిమా కథను మొదట తరుణ్ కి చెప్పగా అతడికి ఈ సినిమా బాగా నచ్చినప్పటికీ అంతకు ముందే శశిరేఖ పరిణయం( Sheshirekha parinayam ) ఫ్లాప్ కావడంతో మరో సినిమా చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్న తరుణ్ అహనా పెళ్ళంటకి నో చెప్పాడు.
ఇక ఉదయ్ కిరణ్ కి సైతం ఒక కథ చెప్పి ఒప్పించగా ఆనంది ఆర్ట్స్ ప్రొడక్షన్ వారు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.కానీ అప్పటికే ఉదయ్కి మరో పెద్ద సినిమా ఓకే కావడంతో తన చిత్రం నుంచి తప్పుకున్నాడు అంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరభద్రం తెలిపారు.
ఈ ఇద్దరు హీరోలలో ఏ ఒక్కరు తన సినిమాలో నటించిన వారు ఈ రోజు స్టార్ హీరో అయ్యేవారు అని చెప్తున్నాడు వీరభద్రం.