బంగాళదుంపలో ఆకు ముడత వైరస్ ను అరికట్టే పద్ధతులు..!

బంగాళదుంప( Potato ) మొక్కలకు ఈ ఆకుముడత వైరస్( Leafroll Virus ) సోకిన కొన్ని రోజుల్లోనే పంట మొత్తం ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.పొలంలో ఉండే కీటకాల ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు ఈ వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది.

 How To Treat Potato Leafroll Virus Details, Potato, Potato Crop, Potato Cultivat-TeluguStop.com

ఈ వైరస్ సోకిన వెంటనే ఆకులు పూర్తిగా ముడుచుకుపోతాయి.లేత ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి.

ఇక ముదిరిన ఆకులు గట్టిగా తెలుసుగా తయారవుతాయి.ఈ ఆకుల కింది భాగం ఊదా రంగులోకి మారి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.

Telugu Agriculture, Techniques, Fertilizers, Leafroll, Potato, Potato Crop, Pota

కాండం కూడా గట్టిగా అయిపోయి నిటారుగా నిలబడి ఉంటుంది.ఈ వైరస్ వల్ల దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.కాబట్టి ఈ వైరస్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ వైరస్ సోకిన తర్వాత ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.ఆరోగ్యంగా ఉండే దుంపల విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.మార్కెట్లో దొరికే సర్టిఫైడ్ విత్తనాలు( Certified Seeds ) మాత్రమే కొనుగోలు చేసి విత్తుకోవాలి.

విత్తనాలను ఇమిడా క్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకుంటే భూమిలోని కీటకాల నుంచి, వివిధ రకాల తెగుళ్ల నుంచి రక్షణ పొందవచ్చు.ఇక కలపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తే దాదాపుగా చీడపీడల బెడద,

Telugu Agriculture, Techniques, Fertilizers, Leafroll, Potato, Potato Crop, Pota

వివిధ రకాల తెగుళ్ల బెడద సగానికి పైగా తగ్గినట్టే.పంట పొలంలో ఏవైనా తెగుళ్లు, చీడపీడలను గుర్తిస్తే వెంటనే సేంద్రియ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టాలి.ఒకవేళ తెగుళ్ల, చీడపీడల వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.

పంట ఎదిగిన తర్వాతనే ఈ రసాయన పిచికారి మందులను ఉపయోగించడం మంచిది.అఫిడ్ పాపులేషన్ ద్వారా ఈ వైరస్ ను అరికట్టవచ్చు.వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాలు తీసుకొని తక్కువ మోతాదులో క్రిమిసంహారక మందుల ఉపయోగ చేసి ఈ వైరస్ ను అరికట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube