పెళ్లిళ్లు, పేరంటాలు, పూజలు ఇలా ఏవి జరిగినా తమలపాకులు( Betel leaves ) కచ్చితంగా ఉండాల్సిందే.మన హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
అయితే తమలపాకులు ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.జుట్టు సంరక్షణకు తోడ్పడతాయి.
ముఖ్యంగా నాలుగు తమలపాకులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే రెండు నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది.
ముందుగా నాలుగు తమలపాకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న తమలపాకుల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ తమలపాకుల హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.తమలపాకుల్లో జుట్టు త్వరగా పెరగడానికి మరియు జుట్టు రాలడాన్ని నయం చేయడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.

ఈ తమలపాకుల మాస్క్ వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.పల్చగా ఉన్న మీ జుట్టు రెండు నెలల్లోనే ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది.అలాగే తమలపాకులు యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున ఈ మాస్క్ తలలో దురద, చుండ్రు వంటి సమస్యలను తరిమికొడుతుంది.స్కాల్ప్ ను హెల్తీ గా, క్లీన్ గా మారుతుంది.
ఇక తమలపాకుల్లో విటమిన్ సి ఉంటుంది.ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జుట్టు రాలడాన్ని మరియు చిట్లడాన్ని సైతం తగ్గిస్తుంది.