ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే ఎంతో మంది తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు హెన్నా ప్యాక్స్ ను వేసుకుంటూ ఉంటాయి.
అయితే హెన్నా అప్లికేషన్ తర్వాత జుట్టు అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది.హెన్నా ఎక్కువగా నూనె గ్రహించే లక్షణం కలిగి ఉంటుంది.
అందువల్ల జుట్టు సహజమైన నూనెలను కోల్పోయి పొడిగా మారుతుంది.సరైన కండీషనింగ్ లేకపోయినా కూడా జుట్టు డ్రై అయిపోతుంది.
అయితే హెన్నా వల్ల పొడిబారిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ కొన్ని ఉన్నాయి.వాటిపై ఓ లుక్కేసేయండి.
హెన్నా మిశ్రమంలో సహజ మాయిశ్చరైజింగ్ పదార్థాలు కలపడం ద్వారా జుట్టు పొడిబారడాన్ని తగ్గించవచ్చు.అంటే గుడ్డు, పెరుగు, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, కలబంద.ఇటువంటివి జుట్టుకు సహజ తేమను అందిస్తాయి.డ్రై హెయిర్ ప్రాబ్లమ్ కు చెక్ పెడతాయి.

హెన్నా అప్లికేషన్ పూర్తైన తరువాత కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, తలకి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి.ఆయిల్ అప్లై చేసుకున్న నెక్ట్స్ డే మైల్డ్ షాంపూను తలస్నానం చేయాలి.తద్వారా హెన్నా వల్ల కోల్పోయిన తేమను తిరిగి అందించవచ్చు.ఆల్మండ్ ఆయిల్ మరియు తేనె సమానంగా తీసుకుని మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని జుట్టు పట్టించి గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోండి.ఈ సింపుల్ రెమెడీ పొడిబారిన జుట్టును రిపేర్ చేస్తుంది.
కురుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

పెరుగు మెంతుల మాస్క్ తో కూడా డ్రై హెయిర్ ను మృదువుగా మార్చుకోవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ అలోవెర వేసి మిక్స్ చేసి జుట్టు మొత్తానికి పట్టించాలి.
గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.