దేశంలోని మెడికల్ కాలేజీలలో విదేశీయులు, ఎన్ఆర్ఐ విద్యార్ధుల కోటాకు సంబంధించి చోటు చేసుకున్న అవకతవకలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి ఏజెన్సీలు దాడులకు దిగాయి.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఆరు ప్రాంతాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది.ఎన్ఆర్ఐ కోటా కింద ప్రైవేట్ మెడికల్ కాలేజీ అడ్మిషన్‌లలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈ దాడులు జరిగాయి.
కోల్‌కతా నార్త్ ( Kolkata North )ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు ఈడీ దాడులు నిర్వహించినట్లుగా సమాచారం.అక్కడ అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో నకిలీ ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లను( Fake NRI certificates ) ఉపయోగించి పలువురు అడ్మిషన్లు పొందారని ఆరోపణలు వచ్చాయి.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లలో భారీ ఎత్తున నగదు చెల్లింపులకు పాల్పడుతున్నారనే నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు( ED officials ) ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.కోల్‌కతా, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలలో దాడులు జరిగాయి.

ఈడీ అధికారుల బృందాలకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు చెందిన సిబ్బంది ఎస్కార్ట్‌గా వెళ్లారు.పశ్చిమ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న 8 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈడీ స్కానర్ కింద ఉన్నాయి .అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దాడులు, సోదాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు.గతేడాది డిసెంబర్‌లో కూడా కేంద్ర ఏజెన్సీ అధికారలు( Powers of Central Agency ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు, దాడులు నిర్వహించారు .

కోల్‌కతా ఉత్తర శివార్లలోని సాల్ట్ లేక్, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని హల్దియా, పశ్చిమ బుర్ద్వాన్‌లోని దుర్గాపర్, దక్షిణ పరగణాల్లోని బడ్జ్ బడ్జ్, బిర్బూమ్ వంటి ప్రదేశాలలోని మెడికల్ కాలేజీలలో అవకతవకలు జరిగినట్లు అధికారులు తెలిపారు.నకిల సర్టిఫికెట్లు సమర్పించడం ద్వారా అడ్మిషన్ పొందడంతో పాటు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారులకు కూడా ఈ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.