అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు జియో సైకిల్ అనేది బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
జియో (Jio)త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ సైకిల్‌ను (electric cycle )విడుదల చేయబోతుండగా, జనాలకు చాలా క్యూరియాసిటీ చోటుచేసుకుంది.దానికి కారణం దాని ఫీచర్స్ అని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవలసిన అవసరం లేదు.
ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయబడితే 400 కి.మీ వరకు ప్రయాణించగలదు అని జియో నిర్వాహకులు చెబుతున్నారు.ఆధునిక సాంకేతికత మరియు స్టైలిష్ డిజైన్‌తో పాటు సరసమైన ధరతో, ఈ ఇ-సైకిల్ వినియోగదారులను ఆకర్శించడానికి మీ ముందుకి వచ్చేస్తోంది.కాబట్టి దీని ఫీచర్ల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయండి!

ఇక జియో ఎలక్ట్రిక్ సైకిల్ (jio electric cycle)డిజైన్ మరియు ఫీచర్లు విషయానికొస్తే… జియో యొక్క కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ సరసమైనది మాత్రమే కాదండోయ్.దాని స్టైలిష్ లుక్ మరియు ఆధునిక డిజైన్ ప్రజల దృష్టిని బాగా ఆకట్టుకుంటోందని చెప్పుకోవచ్చు.స్పోర్టీ మరియు ట్రెండీ డిజైన్‌తో, ఈ సైకిల్ మహిళలకు కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
స్టైలిష్ LED లైట్లు & డిజిటల్ డిస్ప్లే, సైకిల్‌ను మరింత ఆకర్షణీయంగా చేసే డైమండ్ ఫ్రేమ్ డిజైన్ దాని సొంతం.ఇది సౌకర్యవంతంగా మాత్రమే కాదండోయ్.దృఢంగా ఉంటుంది కూడా.ఎందుకంటే దీనికి అమర్చిన శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీ అది రుజువు చేస్తోంది.
ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే… 400 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ఇక ఈ సైకిల్ ఎకో-మోడ్ నుండి హై-స్పీడ్ మోడ్ కలిగి… GPS ట్రాకింగ్, స్మార్ట్ కనెక్టివిటీ మరియు రివర్స్ మోడ్ వంటి అధునాతన సాంకేతికతలు కలిగి ఉంది కాబట్టి ఇది ఏ రహదారిపైనైనా సజావుగా ప్రయాణిస్తుంది అని చెబుతున్నారు.కాగా జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర ₹25,000 నుండి ₹35,000 మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.దాంతో మార్కెట్లో అత్యంత సరసమైన ఈ-బైక్‌ల సరసన ఇది చేరింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.నివేదికల ప్రకారం చూసుకుంటే… జియో ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం కలదు.
ప్రారంభ కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్‌లో భాగంగా ప్రత్యేక తగ్గింపులు మరియు అదనపు వారంటీని పొందవచ్చు.