అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ).అక్కడ అక్రమ వలసదారులుగా ఉన్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఇప్పటికే పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వారి దేశానికి పంపుతున్నాడు.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.
అయితే భారతీయుల చేతులకు , కాళ్లకి గొలుసులు వేసి బంధించి తీసుకురావడం దుమారం రేపుతోంది.అమెరికా నుంచి బహిష్కరణకు గురైన దాదాపు 300 మందిని పనామాలోని ఓ హోటల్‌లో నిర్బంధిస్తున్నారు.
అంతర్జాతీయ అధికారులు( International authorities ) తమ దేశానికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసే వరకు వేచి ఉండగా వారిని బయటికి వెళ్లనివ్వడం లేదు.
వలసదారులలో 40 శాతం పైగా ఎక్కువ మంది స్వచ్ఛందంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లరని అధికారులు చెబుతున్నారు.
హోటల్ గదుల్లోని వలసదారులు అక్కడి కిటికీలకు హెల్ప్, మనదేశంలో మనం రక్షించబడటం లేదంటూ సందేశాలు రాస్తున్నారు.ఇరాన్, భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ( Iran, India, Nepal, Sri Lanka, Pakistan, Afghanistan, China )సహా 10 ఆసియా దేశాల నుంచి వలసదారులు ఎక్కువగా ఉన్నారు.
ఈ దేశాలకు చెందిన వారిని నేరుగా బహిష్కరించే విషయంలో అమెరికాకు ఇబ్బందులు ఉన్నాయి.దీంతో పనామా మీదుగా వీరిని తరలిస్తున్నారు.

పనామా భద్రతా మంత్రి ఫ్రాంక్ అబ్రెగో ( Minister Frank Abrego )మీడియాతో మాట్లాడుతూ.పనామా – అమెరికా మధ్య వలస ఒప్పందంలో భాగంగా వలసదారులకు వైద్య సహాయం, ఆహారం అందుతున్నాయని చెప్పారు.బహిష్కరించబడిన వారికి వంతెన లేదా రవాణా మార్గంగా పనిచేయడానికి పనామా ప్రభుత్వం అంగీకరించింది.అయితే ఈ ఆపరేషన్ తాలుకా ఖర్చులన్నింటినీ అమెరికాయే భరిస్తుంది.అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పర్యటన తర్వాత ఈ నెల ప్రారంభంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.

పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో గత గురువారం వలసదారుల విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.బహిష్కరణకు గురైనవారు ఎదుర్కొంటున్న నిర్బంధం, చట్టపరమైన చిక్కులు పనామాలో ఆందోళన కలిగిస్తున్నాయి.