వైజయంతి మూవీస్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి అశ్విని దత్ అనేక సినిమాలో నిర్మిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఆయన గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.
కానీ కాలం మారుతున్న కొద్ది కొన్ని ఫ్లోపులు కూడా చవిచూడాల్సి వచ్చింది.దాంతో కొన్నాళ్లపాటు నిర్మాణానికి దూరంగా ఉన్న అశ్విని దత్ కూతుళ్ళ రాకతో కొత్త ఉత్సాహంతో సినిమాను నిర్మిస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు.
అశ్విని దత్ కి ముగ్గురు కుమార్తెలు.అందులో పెద్ద కుమార్తె స్వప్నా దత్ నిర్మాతగా మారి తొలుత సినిమాలు తీయడం మొదలుపెట్టింది.
స్వప్న సినిమాస్ అనే పేరుతో ఆమె చిత్ర నిర్మాణం చేపడుతోంది.ఆ తర్వాత ప్రియాంక దత్ తో కలిసి వైజయంతి మూవీస్ లోనే సినిమాలు తీయడం మొదలుపెట్టారు.
ఇక తన కూతుర్లు సినిమా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అశ్విని దత్ అడ్డు పడలేదు.తనవంతు సహాయం అందించారు.అలా వారు కలిసి తీసిన సినిమాలు మహానటి, జాతి రత్నాలు, సీతారామం వంటివి బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో ఆ సక్సెస్ ని ప్రస్తుతం అశ్విని దత్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ప్రియాంక దత్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే.
అయితే అశ్విన్ తో ప్రేమలో పడ్డ ప్రియాంక ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి తోలుతా భయపడింది.కానీ అశ్విన్ యొక్క టాలెంట్ నీ గుర్తించిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు అశ్విని దత్ కి వారి ప్రేమ విషయం చెప్పాడు.
అంతే కాదు పెళ్లి చెయ్యాలని సూచన కూడా ఇచ్చాడు.
అశ్విన్ ప్రియాంకల జోడి బాగుంటుందని దర్శకుడుగా నాగ అశ్విన్ మంచి స్థాయికి వెళతాడని రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డాడు.దాంతో అశ్విని దత్ వారి పెళ్లికి అంగీకరించాడు.ప్రస్తుతం నాగ్ అశ్విన్ మహానటి సినిమా తర్వాత ప్రభాస్ తో 400 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ కే చిత్రాన్ని తీస్తున్నాడు.
అసలు సినిమాలే వద్దు అని కొన్నాళ్ల పాటు పరిశ్రమకు దూరమైన అశ్విని దత్ కి కూతుళ్లు, అల్లుడు రూపంలో మంచి వారసత్వం దొరికినట్లు అయింది.మొత్తానికి రాఘవేంద్ర రావు ఇచ్చిన సలహాతో అశ్విని దత్ వ్యాపారం కూడా బాగానే జరుగుతోంది.
ఇక అశ్వినీ దత్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో గతంలో అనేక హిట్టు సినిమాలు వచ్చాయి.