ఏపీ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సిద్ధమవుతున్నారు.జనవరి 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ( AP Cabinet Expansion ) ఉండే అవకాశం ఉన్నట్లు గా కొంతమంది పార్టీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఈ మంత్రివర్గ విస్తరణలో కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు.వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు( Nagababu ) కూడా ఉన్నారు .ఇదే విషయాన్ని నెల రోజుల కిందటే చంద్రబాబు ప్రకటించారు.ఐదు నెలల తరువాత ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానంలో ఒకటి నాగబాబుకు ఇవ్వనున్నారు.
నాగబాబు తో పాటు మరికొంతమందిని క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది.ఇక ప్రస్తుత మంత్రులుగా కొనసాగుతున్న వారిలో పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
ప్రస్తుతం క్యాబినెట్ లో 25 మంది ఉన్నప్పటికీ నలుగురైదురు ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ, వారికి మార్కులు కేటాయిస్తున్నారు పనితీరు సక్రమంగా లేని ఆ నలుగురిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.
పనితీరు సక్రమంగా ఉన్న మంత్రులలో పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) నాదెండ్ల మనోహర్, నారా లోకేష్ , అనిత, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ వంటి వారు ఉన్నారట.మిగిలిన వారిలో పనితీరు సక్రమంగా లేని నలుగురిని తప్పించనున్నారు.టిడిపి , జనసేన , బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు సీనియర్ నేతలను పక్కన పెట్టారు .మొదటిసారి గెలిచిన వారికి మంత్రి పదవులను ఇచ్చారు.గతంలో ఎప్పుడూ చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కలేదు.ఈ విషయంలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నప్పటికీ , ఆ అసంతృప్తిని బయట పెట్టలేని పరిస్థితి వారిది.
సీనియర్లను సైతం పక్కనపెట్టి కొత్తగా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చినా, వారిలో పనితీరు సక్రమంగా లేనివారిని క్యాబినెట్ లో కొనసాగించడం వల్ల అనవసర తలనొప్పులు తప్ప ఉపయోగం ఉండదని భావిస్తున్న చంద్రబాబు అటువంటివారిని క్యాబినెట్ విస్తరణలో పక్కన పెట్టే ఆలోచనతో ఉన్నారు.జిల్లా నేతలను సమన్వయం చేసుకోలేకపోవడం, తమకు కేటాయించిన శాఖలపై ఇప్పటికీ పట్టు సంపాదించలేకపోవడం, అధికార యంత్రాంగంపై సరైన పట్టు లేకపోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న బాబు వారిని తప్పించే ఆలోచనతో ఉన్నారట.