చైనాలోని రుషాన్ నగరంలో(Rushan City, China) ఓ ఫ్యూనరల్ హోమ్ వింత ఉద్యోగ ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.“మార్చురీ మేనేజర్”(Mortuary Manager) పోస్టు కోసం రుషాన్ మున్సిపల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ విడుదల చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఉద్యోగానికి ఎంపికవ్వాలంటే అభ్యర్థులు ఓ విచిత్రమైన పరీక్షలో నెగ్గాల్సిందే!
ఈ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇందులో చేరే వారికి నెలకు రూ.25,600 జీతం (2,200 యువాన్లు) ఇస్తారు.అయితే వారు ఈ జాబ్ ఇంటర్వ్యూలో భాగంగా గడ్డకట్టే చలిలో ఉన్న మార్చురీలో 10 నిమిషాలు ఉండాలి.45 ఏళ్ల లోపు పురుషులు మాత్రమే అర్హులు.జూనియర్ సెకండరీ విద్య(Junior secondary education) తప్పనిసరి.24 గంటల షిఫ్టుల్లో పనిచేయాలి.3 సంవత్సరాల కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు.రూ.816 (70 యువాన్లు) దరఖాస్తు ఫీజు మార్చురీ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, నేపథ్య తనిఖీలు, 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటాయి.
“మార్చురీ వాతావరణానికి అలవాటుపడతారా లేదా అని తెలుసుకోవడానికే ఈ పరీక్ష” అని అధికారులు చెబుతున్నారు.ఈ ప్రకటన చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది నవ్వుకుంటుంటే, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొందరికి ఈ వింత పరీక్ష నవ్వు తెప్పిస్తుంటే, మరికొందరు మాత్రం తక్కువ జీతం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో దీనిపై జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.“కనీసం శ్మశానంలో(cemetery) 10 నిమిషాలు ఉండమనలేదు, అదే పదివేలు!” అంటూ ఒక నెటిజన్ చమత్కరించగా, “భయం కాదు బాసూ, జీతమే భయంకరంగా ఉంది!” అంటూ మరొకరు సెటైర్ వేశారు.అంటే, చలిలో మార్చురీలో ఉండటం కంటే తక్కువ జీతమే పెద్ద సమస్య అని చాలామంది భావిస్తున్నారు.
నిజానికి, శ్మశానవాటికలో పనిచేసే ఉద్యోగాలకు ఈ ఉద్యోగం కంటే ఎక్కువ జీతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే వాటికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం.మార్చురీ మేనేజర్ ఉద్యోగానికి కూడా మానసిక పరీక్షలు లేదా ఇంటర్న్‌షిప్‌ల వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించవచ్చు అని విమర్శకులు సూచిస్తున్నారు.విమర్శలు ఎలా ఉన్నా, సాహసోపేతమైన ఈ ఉద్యోగాన్ని స్వీకరించడానికి కొందరు మాత్రం సిద్ధంగా ఉన్నారు.