సాధారణంగా వేళ్లకు ఉంగరాలు ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి.కొంతమంది ఎంతో ఇష్టంగా ఉంగరాన్ని వేళ్ళకు ధరిస్తుంటారు.
మరికొంతమంది వారి జాతక రీత్యా, వారి ఇష్టదైవానికి అనుగుణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరిస్తారు.అయితే దేవుని ఉంగరాలు ధరించినపుడు మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసా? దేవుడి ఉంగరం ధరించినప్పుడు కొన్ని పనులు అసలు చేయకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అవి ఏంటి అంటే?
చాలామంది చేతి ఉంగరానికి లేదా మెడలో చైన్ లాకెట్ కి దేవుని ప్రతిమ ఉన్న పెండెంట్ లను ధరిస్తుంటారు.ఉదయం లేచినప్పుడు ఆ ప్రతిమలను చూసి ఆ రోజు అంతా సవ్యంగా జరగాలని ప్రార్థిస్తూ ఉంటారు.
కొంతమంది ఇష్ట దైవంగా భావించి అలాంటి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు.మరికొందరు జాతకరీత్యా దోషాలు ఉంటే వాటి నివారణ కోసం అలాంటి ఉంగరాలను ధరిస్తారు.అయితే వాటిని ధరించే ముందు ఆ ఉంగరాలను పాలలో కడిగి ఇష్ట దైవ సన్నిధినందు అభిషేకం నిర్వహించిన తర్వాత ధరించడం వల్ల జాతకరీత్యా దోషాలు తొలగిపోతాయి.ఈ ఉంగరం ధరించేటప్పుడు దేవుడి తల మన చేతి వైపు ఉండేలా, కాళ్లు మన చేతి వేళ్ళ వైపు ఉండేలా ధరించాలి.
మనలో చాలా మంది ఈ ఉంగరాలను ధరించి నిత్యం వారి పనులను చేస్తూ ఉంటారు.అలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి.ఈ ఉంగరం ధరించినప్పుడు మాంసాహారం తినరాదు.ఆడవారు బహిష్టు సమయంలో వారి మెడలో ఉన్న దేవుడి లాకెట్ లేదా ఉంగరాలను ముందుగానే తీసి భద్రపరుచుకోవాలి.
ఇలా దేవుడు ప్రతిమలు కలిగిన ఉంగరాన్ని ఎప్పుడూ కూడా ఎడమచేతికి ధరించరాదు.మనం భోజనం చేసేటప్పుడు ఎంగిలి అన్నం ఉంగరానికి తాకకూడదు.
ధూమపానం, మద్యపానం చేసేవారు అసలు ఇలాంటి ఉంగరాలను ధరించకూడదు.మన చేతి వేళ్ళకు ధరించిన ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొనేటప్పుడు మన చేతి వేళ్ళు ముడుచుకుని ఉంగరాన్ని నమస్కరించు కోవడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి.
ఈ నియమాలను పాటిస్తూ దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించాలి.