ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు చాలామంది ఇళ్లలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉంటాయి.కొన్ని విషయాలలో కుటుంబంలో ఏకాభిప్రాయాలు ఉండడం చాలా కష్టం.
ఇలా ఉండడం వల్ల ఎక్కువగా వాదనకు దారితీస్తూ ఉంటుంది.కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగితే ఆ ఇంటి వాతావరణం చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.
దీనివల్ల ప్రతి ఒక్కరి జీవితం దారుణంగా మారిపోతుంది.చాలాసార్లు ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది.
ఇది ప్రజల మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది.ఇంట్లో శాంతి( Peace ) లేకపోవడం వల్ల ఆర్థికంగా, మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే వాస్తు యొక్క కొన్ని చర్యలతో మీ కుటుంబంలోని వివాదాలను దూరం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రంలో ఉప్పును ఇంటి నుంచి ప్రతికూలతను తొలగించడానికి ఉపయోగిస్తారు.గదిలో ఒక మూలలో రాతి ఉప్పు( Rock Salt ) ముక్క ఉంచడం ఎంతో మంచిది.ఉప్పు ముక్కను ఈ మూలలో ఒక నెలపాటు ఉంచాలి.ఒక నెల తర్వాత దాన్ని తీసేసివేసి దాని స్థానంలో కొత్త రాతి ఉప్పును ఉంచాలి.దీంతో కుటుంబంలో శాంతి నెలకొని కుటుంబ కలహాలు దూరమైపోతాయి.
ఇంకా చెప్పాలంటే చాలా ఇళ్లలో కర్పూరన్ని పూజలో ఉపయోగిస్తూ ఉంటారు.

దీని సహాయంతో మీరు ఇంటి వాస్తు దోషాలను కూడా దూరం చేసుకోవచ్చు.మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే రాత్రి నిద్రపోయే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో( Camphor with Cow Ghee ) ముంచి ఇత్తడి పాత్రలో కాల్చాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి ఏర్పడి, అశాంతి, గొడవలు దూరమైపోతాయి.
అంతేకాకుండా వారంలో ఏ ఒక్క రోజైనా కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయాలి.ఇది కూడా ఇంట్లోకి సుఖ సంతోషాలను తెస్తుంది.
DEVOTIONAL







