తిరుమల శ్రీవారిని( Tirumula ) దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి చాలా మంది భక్తులు ప్రతి రోజూ తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు.అంతే కాకుండా దాదాపు చాలా మంది భక్తులు ( Devotees )స్వామి వారికి పూజలు అభిషేకలు జరిపిస్తూ ఉంటారు.
మరి కొంత మంది భక్తుల స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు.ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల పుణ్యక్షేత్రం శుభవార్త చెప్పింది.
స్వామి వారిని దర్శించుకోవడానికి టికెట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
అయితే మంగళవారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేసింది.
జూన్ లకు సంబంధించి శ్రీవారి టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.స్వామి వారి సేవకు సంబంధించి కూడా టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
వెంకటేశ్వర స్వామి అర్జిత సేవ టికెట్లు( Venkateswara Swamy ) జూన్ మాసానికి సంబంధించి మార్చి 23 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సేవాల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ఉన్నాయి.దీనితో పాటు జూన్ నెలకు సంబంధించి పలు ఆర్జిత సేవలకు ఆన్ లైన్ లో లక్కీడీప్ నమోదుకు మార్చి 24 ఉదయం 11 గంటలకు ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు.లక్కీడీప్ లో టీకెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించాలి.
అంతేకాకుండా జూన్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షణ టికెట్లను మార్చి 24 న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.వృద్ధులు, దివ్యాంగులు కొటాకు సంభందించిన శ్రీవారి దర్శనం టికెట్లను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ టికెట్లు ఏప్రిల్ నెలలకు సంబంధించినవి అని తెలిపారు.సోమవారం రోజు శ్రీవారిని సినీ నటుడు మంచు విష్ణు,విశ్వక్ సేన్ శ్రీవారిని దర్శించుకున్నట్లు సమాచారం.దేవస్థానం అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు.
DEVOTIONAL