విషయం తెలియక తోబుట్టువునే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే

ఒకరి నొకరు ఇష్టపడ్డారు, దీనితో ఒక ఏడాది పెద్దది అయినప్పటికీ గత ఎనిమిదేళ్లు గా కలసి సహజీవం చేశారు.ఇద్దరి అభిప్రాయాలు కలవడం తో గతేడాది పెళ్లి బంధం తో కూడా ఒక్కటయ్యారు.

 England Man Married His Fathers Daughter He Knows After 8 Years Court-TeluguStop.com

త్వరలో ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చే సంతోషంలో ఉన్న ఆ యువ జంట కు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది.ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే వారిద్దరూ భార్య,భర్తల కంటే ముందు అక్కా, తమ్ముడు అని.దానితో ఆ యువకుడు ఖంగుతిన్నాడు.ఇంగ్లాండులో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.24 ఏళ్ల వ్యక్తి ఇటీవల ‘రెడిట్’ అనే సోషల్ మీడియా సైట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.గత ఎనిమిదేళ్లు గా కలిసి జీవిస్తున్న మేము గతేడాదే పెళ్లి బంధం తో కొత్త జీవితాన్ని ప్రారంభించాం.

ప్రస్తుతం నా భార్య గర్భవతి కూడా, అంటే 2020 లో కేవలం మేము ఇద్దరమే ఉన్న మా కుటుంబం లోకి మూడో వ్యక్తి కూడా అడుగు పెట్టబోతున్నాడు.అయితే అంతా బాగానే ఉంది అని ప్రశాంతంగా ఉన్న జీవిస్తున్న మా జీవితంలో అనుకోని చేదు విషయం బయటపడింది.

 England Man Married His Fathers Daughter He Knows After 8 Years Court-విషయం తెలియక తోబుట్టువునే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నా భార్య తల్లితో ఇటీవల మాటల సందర్భంగా నా భార్య తండ్రి గురించి ప్రస్తావనకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాలు విని షాకయ్యా.

నా భార్య తండ్రి మరెవ్వరో కాదు నా తండ్రే’అయితే అది నిజమో కాదో తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇద్దరం కూడా ఎంతో రహస్యంగా డీఎన్ఏ పరీక్షలు సైతం చేయించుకున్నాం.అయితే రిపోర్టులు కూడా మేమిద్దరం ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలమని తేలడం మా మనసుకు చాలా బాధగా అనిపించడం తో పాటు భయం కూడా పట్టుకుంది.

ఇంతకీ అతడికి కలిగిన భయం ఏమిటంటే ఇంగ్లాండ్ లో రక్త సంబంధికుల మధ్య వైవాహిక, లైంగిక సంబంధాలపై నిషేదం ఉంది.ఒకే వ్యక్తికి పుట్టిన బిడ్డలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం పిల్లలు జన్యుపరమైన లోపాలను ఎదుర్కొంటారనే కారణంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది.

అందుకే ఆ వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురవ్వుతున్నాడు.బిడ్డ పుట్టిన తరువాత సహజంగా అక్కడ డీఎన్‌ఏ వివరాలను పొందుపరుస్తారు.

అయితే ఆ సమయంలో ఆమె డీఎన్‌ఏ, అతడి డీఎన్ ఏ ఒకటని తెలిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటారేమోనన్న భయం అతడిని వెంటాడుతుంది.నా కొడుకు ఆరోగ్యంగా పుడితే ఏ సమస్య లేదు.

అలా జరగపోతే మా డీఎన్ఏ వివరాలను బయటపెడతారు.ఇంగ్లాండులో ఇది నేరం అంటూ తన బాధను వెళ్లగక్కాడు.

అంతేకాకుండా భవిష్యత్తులో ఈ విషయం బిడ్డకు తెలిసినా అతడు ఎలా స్వీకరిస్తాడో అన్న దిగులు కూడా అతడిలో మెదులుతుంది.అయితే ఈ విషయం తెలిసిన తర్వాత కూడా మేం విడిపోవాలని భావించడం లేదు.

ఎందుకంటే.మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం.

 

మేం రక్త సంబంధికులం అని తెలిసిన తర్వాత కూడా మాలో ఆ ఫీలింగ్ కలగలేదు.ఇప్పుడు మాకు ఓ బిడ్డ కూడా పుడుతున్నాడు.కనీసం ఆ బిడ్డ కోసమైనా మేం కలిసి ఉండాలి.తెలియకుండా జరిగిన ఈ తప్పిదానికి మేం బాధ్యులం కాదనే భావిస్తున్నా.ఈ విషయాన్ని నేను రహస్యంగా ఉంచగలనా? ఎందుకంటే ఇది ఇంగ్లాండ్’ అని రెడిట్ సైట్ లో తన మనసులోని మాటను తెలిపాడు.అయితే ఇతడి పోస్టును చదివిన కొందరు వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలని సూచించడం తో పాటు చట్టపరమైన సమస్యలు ఎదుర్కోకుండా న్యాయవాదులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.

మరికొందరు అయితే రక్తసంబంధికులని తెలిసిన తర్వాత కూడా లైంగిక సంబంధం కొనసాగిస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు.దీనితో ఆ జంట మరింత ఆందోళన చెందుతుంది.

#ManMarried #8 Years Life #England Man

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు