సాధారణంగా హెయిర్ రూట్స్ వీక్ గా మారే కొద్ది జుట్టు రాలడం అనేది అధికం అవుతుంది.దాంతో జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతుంది.
అందుకే హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మార్చుకోవడం ఎంతో అవసరం.అయితే అవకాడో అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ మ్యాజికల్ ఫ్రూట్ కు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది.మరి ఇంతకీ అవకాడో పండును జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాగా పండిన ఒక అవకాడో పండును తీసుకుని మధ్యలోకి కట్ చేసి గింజ తొలగించి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పల్ప్ ను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.అవకాడో, గుడ్డు లో జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి.ఈ రెండిటినీ కలిపి జుట్టుకు పట్టించడం వల్ల బలహీనమైన కుదుళ్లు బలోపేతం అవుతాయి.
హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.
కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా పొడుగ్గా మారతాయి.అలాగే ఈ అవకాడో( Avocado ) మాస్క్ ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
జుట్టు సిల్కీగా మారుతుంది.హైడ్రేటెడ్ గా ఉంటుంది.
జుట్టు ఆరోగ్యానికి అవకాడో పండు ఒక కవచంలా ఉంటుంది.
.