రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం( Sambrani Dhoop ) వేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తిలు తొలగిపోతాయి.అలాగే సానుకూల వాతావరణం నెలకొంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
అలాగే వారంలో ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఆదివారం పూట సాంబ్రాణి ధూపం వేయడం వలన ఆత్మబలం, సిరి సంపదలు,( Wealth ) కీర్తి ప్రతిష్టలతో పాటు ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది.
ఇంకా చెప్పాలంటే సోమవారం నాడు దేహ మానసిక ఆరోగ్యం మెరుగుపడటం, మనస్సు కు గొప్ప ప్రశాంతత,( Peace ) అంతే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది.ఇక మంగళవారం నాడు ధూపం వేయడం వలన శత్రు భయం, ఎదుటి వారికి మీపై కలిగిన అసూయలు అన్నీ కూడా తొలగిపోతాయి.

అంతే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.ఇక రుణ బాధ కూడా ఉండదు.అంతే కాకుండా సుబ్రహ్మణ్యస్వామి( Subrahmanya Swamy ) అనుగ్రహం కూడా లభిస్తుంది.అలాగే బుధవారం రోజు ఇంట్లో ధూపం వేయడం వలన నమ్మక ద్రోహం, ప్రత్యర్థుల కుట్రలు మన నుండి తప్పిపోతాయి.
అంతే కాకుండా మనకు మహానుభావుల నుండి ఆశిస్సులు కూడా లభిస్తాయి.ఇక ఇంట్లో ఆర్థిక అభివృద్ధి( Financial Development ) కూడా జరుగుతుంది.ఇక గురువారం నాడు ఇంట్లో ధూపం వేయడం వలన కార్యజయం, అనుకోకుండా ఎదురైన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి.

ఇక శుక్రవారం( Friday ) నాడు ఇంట్లో ధూపం వేయడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది.అంతే కాకుండా ఇంట్లో పలు శుభకార్యాలు జరుగుతాయి.ఇంకా చెప్పాలంటే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది.
శనీశ్వరుడి భైరవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.ఈ విధంగా రోజు ఇంట్లో ధూపం వేయడం వలన మనకు ఎన్నో శుభాలు కలుగుతాయి.
కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో రోజు ధూపం వేయడానికి ప్రయత్నించాలి.దీని వలన మనకు అన్ని ఆటంకాలు తొలగిపోయి అన్ని శుభాలే జరుగుతాయి.