సాధారణంగా అమావాస్య పౌర్ణమి వంటి దినాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాము.కానీ అమావాస్య మంగళవారం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.
హనుమంతుడు ఈశ్వరుడి అంశం.ఈశ్వరుడు శని అంశం కనుక ఆంజనేయుని పూజించడం వల్ల శని బాధలు, ఈతి బాధలు ఉండవని, పురోహితులు చెబుతున్నారు.
ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య రోజు ఏ విధంగా పూజలు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణం ప్రకారం త్రేతాయుగంలో విష్ణుమూర్తి సాక్షాత్తు రాముడి అవతారంలో జన్మిస్తాడు.
లక్ష్మీదేవి సీతమ్మగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా భావిస్తారు.ఇలాంటి రామాయణంలో తాను కూడా భాగం కావాలని శివుడు ఆశపడతాడు.
రామాయణంలో సాక్షాత్తు ఆ శ్రీ రామచంద్రునికి సేవ చేయాలనే ఆశతో పరమేశ్వరుడు ఆంజనేయునిగా అవతరించి శ్రీరాముడికి సేవ చేస్తాడు.అందుకే ఆంజనేయుడిని శివుడి అంశంగా భావిస్తారు.
రామాయణంలో ఆంజనేయుడు పాత్ర ఏ విధమైనదో మనకు తెలిసిందే.నిత్యం స్వామి వారి వెంటే ఉంటే స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్న ఆంజనేయునికి కూడా భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.
ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు కొలువై ఉంటాడు.ఎక్కడైతే రామునికి పూజలను నిర్వహిస్తారు అక్కడే ఆంజనేయుడికి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.అంతటి మహిమ కలిగిన ఆంజనేయుడిని అమావాస్య రోజు పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు.ముఖ్యంగా మంగళవారం అమావాస్య రోజున ఆంజనేయుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.
అమావాస్య రోజు ఆంజనేయునికి తమలపాకుల మాల, వడమాల వెన్నతో అభిషేకాలు నిర్వహించడం వల్ల స్వామి వారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.