మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటారు.కార్తీక మాసంలో కఠినమైన ఉపవాసాలు ఉంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం రోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని వేద పండితులు చెబుతారు.ఈ సంవత్సరం నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి వస్తుంది.
కార్తీక మాసాన్ని అత్యంత శుభకరమైన మాసంగా కార్తీక పౌర్ణమి రోజు నదిలో కానీ, సముద్రంలో కానీ స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలు సంవత్సరం పాటు పుణ్యఫలాన్ని ఇస్తూనే ఉంటాయి.
కార్తీక మాసంలోనే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ప్రతి సంవత్సరం దాదాపు కార్తీక పౌర్ణమి నవంబర్ నెలలోనే వస్తుంది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు పౌర్ణమి స్థానాలు 4 గంటల 30 నిమిషాల లోపే పూర్తి చేస్తుంటారు.కార్తీక పౌర్ణమినీ త్రిపురి పౌర్ణిమ అని కూడా అంటారు.
కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసే నది స్నానాలు సకల పాపాల నుంచి విముక్తిని కలిగిస్తాయని ప్రజలు నమ్ముతారు.స్వర్గం నుంచి దేవతలు ఆ రోజున స్థానానికి వస్తారని చాలామంది భక్తుల నమ్మకం.
అందుకే ఆరోజు తప్పకుండా నది స్నానం చేస్తూ ఉంటారు.

నది స్నానం చేయలేని వారు కనీసం వారి ఇంట్లో అయినా గంగాజలం కలుపుకొని స్నానం చేయడం మంచిది.కార్తీక మాసంలో పూజలు చేయడానికైన, స్నానం చేయడానికైన అయినా 4.31 నిమిషముల వరకు శుభ సమయం గా ఉంటుంది.శాస్త్రాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవంతుడికి నీటిని సమర్పించడం, ఆ తరువాత భగవంతుని ముందు ఉపవాస దీక్ష వదిలితే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.ఆ తరువాత శ్రీహరి విష్ణు లక్ష్మీదేవికి పూజలు చేయడం ఎంతో మంచిది.