తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో బిజేపి ఎమ్మెల్సీ మాధవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపల చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ.
శ్రీనివాసుడి ఆశీస్సులతో ఏపి రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సకాలంలో వర్షాలు కురిసి త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారన్నారు.తిరుమలలో టిటిడి పాలక మండలి, ఈవోలు భక్తులు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయడం సంతోషకరంమని, ఇదే విధంగా భవిష్యత్తులో ముక్కోటి దేవలు ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రార్ధించినట్లు ఎంపీ రెడ్డప్ప తెలిపారు.