పవిత్రమైన ఈ కార్తిక మాసాన్ని కౌముది మాసం.. అని ఎందుకు అంటారో తెలుసా..?

పవిత్రమైన కార్తీక మాసం( Kartika masam ) చలికాలం తో పాటు ప్రారంభమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ మాసంలో శివారాధన, కార్తీక స్నానాలు చేయడం శివ కేశవ పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు.

 Do You Know Why This Holy Month Of Kartika Is Called Kaumudi Masam, Kaumudi Masa-TeluguStop.com

అలాగే కార్తీక మాసంలో మహిళలు నోములు నోచుకోవడం పూజాలు చేయడం లాంటి పవిత్రమైన పనులను చేస్తూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే ఆ మాసాన్ని కార్తిక మాసంగా పిలుస్తారు.

ఈ మాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ మాసంలో చంద్రుడు శక్తి శాలిగా ఉంటాడు.

ఈ కార్తీక మాసంలో నదులు, కాలువలు, చెరువులు బావుల పైన చంద్రుడి కిరణాలు పడతాయి.ఈ విధంగా చంద్రుని కిరణాలు పడిన నీరు ఔషధాల నిలయంగా మారుతుంది.

కాబట్టి రాత్రంతా చంద్రునికి కిరణాలు పడిన ఆ నీటినీ మనం వేకువజామున స్నానానికి ఉపయోగించుకుంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కౌముది( Kaumudi Masam ) అంటే వెన్నెల అని అర్థం వస్తుంది.వెన్నెల పడిన నీటితో స్నానాలు చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా మరియు శరీరం ఉత్తేజంగా తయారవుతుంది.కాబట్టి ఈ మాసన్ని కౌముది మాసం అని పిలుస్తారు.

మనం రోజు ఉదయం చేసే స్నానాల సమయాన్ని బట్టి రుషి స్నానం, దేవ స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు.

అలాగే కార్తీక మాసం లో వేకువ జామున చేసే స్నానాన్ని వెన్నెల స్నానం అని పిలుస్తారు.ఈ స్నానం చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలై( Health problems )నా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే వెన్నెల స్నానాలు ఈ మాసంలో చేస్తాము.కాబట్టి ఈ మాసాన్ని కౌముది మాసం అని పిలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube