మన దేశ భారత భూమిపైన ఎన్నో వేల సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.ప్రతిరోజు ఈ పుణ్యక్షేత్రాలను ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.
మన భారత భూమిపై ఉన్న ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంది.సముద్రుడు వచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తే ఎలా ఉంటుంది.
ఇలాంటి శివలింగ దేవాలయాన్ని దర్శించుకోవాలంటే సముద్రం అనుమతి కచ్చితంగా ఉండాలి.
ఈ దేవాలయాన్ని నిష్కలంక మహాదేవ్ దేవాలయం అని పిలుస్తారు.
ఈ దేవాలయాన్ని భావనగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో నిర్మించారు.సంవత్సరంలో చాలా కాలం ఈ ఆలయం సముద్రంలో మునిగి ఉంటుంది.
అప్పుడప్పుడు సముద్ర నీరు వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే దర్శనానికి వెళ్లే వీలు ఉంటుంది.శ్రావణమాసం, అమావాస్య, ప్రత్యేక పండుగల సమయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తూ ఉంటారు.
ఈ దేవాలయం అంటే భక్తులకు ఎంతో ఇష్టం ఇది సముద్రంలో ఉండడం వల్ల తమకు ప్రత్యేక భక్తి అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతూ ఉంటారు.పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో కౌరవులను వారి బంధువులను చంపేసిన పాండవులు ఆ కలాంకాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచించారు.

పాండవులు సలహా కోసం ఒక మహర్షిని కలిశారు.మహర్షి పాండవులకు ఒక నల్ల జెండాను ఇచ్చి దాన్ని పట్టుకుని సముద్రం తీరం వెంట నడవమని చెబుతారు.పుణ్యభూమి రాగానే నల్ల జెండా తెల్లగా మారుతుందని దాంతో కళంకం పోతుందని తెలిపారు.పాండవులు భావనగర్ లోని కొలియక్ గ్రామం సముద్ర తీరానికి రాగానే జెండా తెల్లగా మారింది.
ఇక్కడ పాండవులు సముద్రస్నానం చేశారు.తమ కలంకం పోయిందని భావించిన పాండవులు ఇక్కడ శివుడిని పూజించగా ముక్కోటి ప్రత్యక్షమయ్యారట.
పరమశివునితో పాండవులు నీవు మాకు దర్శనమిచ్చిన గుర్తుగా ఇక్కడ గుర్తు ఇక్కడ ఉండాలని కోరారు అప్పుడు శివుడు ఇసుకతో శివలింగాన్ని తయారు చేయమని పండులతో చెప్పడం జరిగింది.అలా ఇక్కడ పాండవులు ఐదు శివలింగాలను ప్రతిష్టించారని చెబుతూ ఉంటారు.