ముఖ్యంగా చెప్పాలంటే హిందూ సంప్రదాయం( Hindu tradition ) ప్రకారం వంట చేసేటప్పుడు, వండిన ఆహారం తినేటప్పుడు కొన్ని పద్ధతులను కచ్చితంగా పాటించాలి.వాటి ప్రకారమే నడుచుకోవాలి.
లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.హిందూ ధర్మంలో ఆహారాన్ని దేవతగా భావిస్తారు.
అందుకే తినేటప్పుడు మాత్రమే కాకుండా తయారు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.సరైన పద్ధతులు పాటిస్తే ఆ ఇంట్లో అన్నపూర్ణా మాత ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి.

ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు.అయితే ఎలా వండాలి.ఎలా తినాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ విశ్వాసం ప్రకారం వంట చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం మంచిది.ఆహారం తయారు చేసే ముందు సదరు వ్యక్తి శరీరం మనసు స్వచ్ఛంగా ఉండాలి.తర్వాత ఆహారాన్ని సంతోషకరమైన హృదయంతో వండాలి.
ఆహారం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ప్రదేశంలో మాత్రమే తయారు చేయాలి.అంతే కాకుండా ఆహారం తినే ముందు ఆహార దేవతలకు కృతజ్ఞత తెలియజేయాలి.

ఇందుకోసం భోజనం మంత్రాన్ని పాటించమని పురాణాలలో చెప్పారు.సనాతన ధర్మం ప్రకారం భోజన సమయంలో ( meal time )ఆహారాన్ని ఎప్పుడూ అవమానించకూడదు.ఆహారం ఎప్పుడు కుడి చేతితో తినాలి.ఎడమ చేతి తో తింటే పెద్ద తప్పుగా భావిస్తారు.ఇంకా చెప్పాలంటే ఏ పని చేయాలనుకున్న శుభ ముహూర్తం చూసుకోవాలని చెబుతారు.ఎప్పుడు సరైన సమయంలో, సరైన దిశలో కూర్చొని ఆహారాన్ని తీసుకోవాలి.
తూర్పు దిశను దేవతల దిశగా పరిగణిస్తారు.ఈ దిశలో ఆహారం తీసుకోవడం శుభప్రదం గా చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఆహారం, డబ్బు, నిల్వలు( Food, money, reserves at home ) పెరగాలని కోరుకుంటే ఎల్లప్పుడూ వాటిని దానం చేస్తూ ఉండాలి.హిందూ విశ్వాసాల ప్రకారం అన్నదానం గొప్పదానంగా భావిస్తారు.
జంతువులు, పక్షుల కోసం ప్రతిరోజు ఆహారం అందించడం ఎంతో మంచిది.