ప్రస్తుత సమాజంలో వాతావరణంలోని కాలుష్యం, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వంటి అనేక కారణాలతో ముఖం మీద దుమ్ము, జిడ్డు పేరుకుపోయి ముఖం చాలా నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది.ఇలాంటి చర్మ సమస్యలకు( Skin problems ) పెరుగు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పెరుగులో మన చర్మానికి మేలు చేసే లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.పెరుగు మన చర్మాన్ని మాశ్చరైజ్ కూడా చేస్తుంది.
అంతేకాకుండా ముడతలు మరియు ఫైన్ లైన్లను దూరం చేస్తుంది.ఇది టాన్ మరియు డార్క్ సర్కిల్స్( Dark circles ) తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరిచి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.ఇది మొటిమలను( Pimples ) త్వరగా దూరం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే పెరుగు తీసుకోవడం వల్ల మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.మీరు కాటన్ ఉపయోగించి నేరుగా చర్మంపై దీన్ని అప్లై చేసి పది నుంచి 15 నిమిషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
లేదంటే పెరుగులో నిమ్మ,( Lemon ) ఓట్స్, తేనే మొదలైన పదార్థాలను కలిపి ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి రాసిన మంచి ప్రయోజనం ఉంటుంది.
ప్రతిరోజు ఒక కప్పు పెరుగును ( Curd )తప్పనిసరిగా తీసుకుంటే చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరుస్తుంది.బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు ఉండదు.మన ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖాన్ని తెల్లగా చేసుకోవచ్చు.
ఇలా పెరుగును ముఖానికి అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.దీంతో మనం ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉండదు.
ఏ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.