ప్రస్తుత సమాజంలో యువకుల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ పని మీద దృష్టి, ఏకాగ్రత ( concentration on any task )పెట్టలేకపోతున్నారు.ఎందుకంటే ఏ చిన్న పని చేయాలన్న దానిపై ఫోకస్ లేకుంటే ఆ పనిని అస్సలు చేయలేరు.
పనిపై ఏకాగ్రత లేకపోతే ఆ పని చేసి కూడా ఉపయోగముండదు.ఏకాగ్రత, ఫోకస్ పెరగాలంటే కొన్ని వ్యాయామాలు కచ్చితంగా చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే బ్రీతింగ్ వ్యాయామాలు ఏకాగ్రత, ఫోకస్ ను పెంచుతాయి.ఉదయం నిద్ర లేవగానే మీరు చేయగలిగే బ్రీతింగ్ వ్యాయమాలు చేస్తే ఆటోమేటిక్ గా మీ ఏకాగ్రత, ఫోకస్ రెండు పెరుగుతాయి.
కావాలంటే ఒక వారం రోజులు ప్రయత్నించి చూడండి.

ఇంకా చెప్పాలంటే ఏకాగ్రతను పెంచే అతి కీలకమైన బ్రీతింగ్ టెక్నిక్ డీప్ బెల్లీ బ్రీతింగ్ ( Deep belly breathing )అని నిపుణులు చెబుతున్నారు.అంటే మీ ఊపిరితిత్తులతో శ్వాస తీసుకుని నెమ్మదిగా శ్వాస వదలాలి.మీరు శ్వాస తీసుకున్నప్పుడు కడుపు లోపలికి నొక్కుకుపోయినట్లు ఉండాలి.
అప్పుడే ఈ టెక్నిక్ పనిచేస్తుంది.ఇంకా చెప్పాలంటే బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ కూడా దీనికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ టెక్నిక్ ని ఎలా చేయాలంటే ఒక బాక్స్ కి నాలుగు దశలు ఉంటాయి.మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఈ నాలుగు దశలను కౌంట్ చేస్తూ శ్వాస వదలాలి.

సింపుల్ గా చెప్పాలంటే నాలుగుసార్లు కౌంట్ చేసుకుంటూ శ్వాస తీసుకోవాలి.నాలుగు సార్లు కౌంట్ చేసి ఊపిరి బిగబట్టాలి.ఆ తర్వాత నాలుగు సార్లు కౌంట్ చేసి ఊపిరి వదలడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే ఒక సైడ్ మాత్రమే ముక్కును పట్టుకొని బ్రీతింగ్ వ్యాయామం చేసినా మంచిదే.
దీనివల్ల ఒత్తిడి కూడా దూరమైపోతుంది.దీనిని నాడీ శోధన( Nervous search ) అని కూడా అంటారు.
ఇంకా చెప్పాలంటే అనులోమా ప్రాణయామ యోగా కూడా ఏకాగ్రతను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ టెక్నిక్ ని ఉదయాన్నే చేస్తే ఒత్తిడి దూరం అవడంతోపాటు ఏకాగ్రత, ఫోకస్ కూడా పెరుగుతాయి.