ప్రపంచం మొత్తం శివుడి ఆజ్ఞ మేరకే నడుస్తుందని భావిస్తారు.శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతుంటారు.
శివుడిని అభిషేక ప్రియుడని పిలుస్తారు.శివుడికి భస్మంతో అభిషేకం చేస్తారు, స్మశానంలో నివసిస్తారు, త్రిశూలం చేతపట్టుకొని, రుద్రాక్షలు ధరించి ఉంటాడు.
ఈవిధంగా పరమశివుడు ధరించే ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో అర్థం దాగి ఉంది.మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నంది:

నంది శివుని వాహనం.శివుడి ప్రమధ గణాలలో నందికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.నంది కైలాసం బయట ఉంటాడు.నంది అనుమతి లేనిదే కైలాసంలోకి ప్రవేశం లేదు.శివ భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్తే తప్పకుండా తీరుస్తారని భావిస్తుంటారు.
రుద్రాక్ష:

శివుని మెడ చుట్టూ రుద్రాక్ష హారాన్ని ధరిస్తాడు.రుద్రాక్ష అనే పదం రుద్ర అంటే శివుడు అక్ష్ అంటే కన్నీళ్ల నుంచి వచ్చినది.శివుడు కళ్ళ నుంచి వచ్చిన కన్నీరు నేల పై పడి అవి పవిత్రమైన రుద్రాక్ష చెట్టులోకి వెళ్లాయని చెబుతారు.
పాము:

శివుడు అనగానే మనకు మెడలో పాము గుర్తొస్తుంది.శివుని మెడ చుట్టూ 3 చుట్టలు చుట్టబడి ఉంటుంది.ఈ మూడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తాయి.
మూడో కన్ను:

శివుడు నుదిటి పై మధ్య భాగంలో మూడవకన్ను ఉంటుంది.మూడవ కన్ను శివుడు కోపంతో ఉన్నప్పుడు లేదా నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే తెరుస్తాడు.
నెలవంక:

శివుడు శిరస్సుపై అర్ధచంద్రుడు ఆకారంలో నెలవంక ఉంటుంది.ఈ నెలవంక వృద్ధి చెందడం తగ్గిపోవడం అనేది ప్రకృతి అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది.
త్రిశూలం:

శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం.ఈ త్రిశూలానికి 3 పదునైన మొనలు ఉంటాయి.ఈ మూడు కోరిక, చర్య, జ్ఞానాన్ని సూచిస్తాయి.