పండ్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌కు నిలయమైన పండ్లు డైలీ డైట్లో చేర్చుకుంటే ఎన్నో జబ్బులకు చెక్ పెట్టవచ్చు.
అయితే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో.ఆ సమయంలో తీసుకుంటున్నాము అన్నది కూడా అదే ముఖ్యం.
సాధారణంగా చాలా మంది రాత్రి వేళ పండ్లు తీసుకుంటారు.కానీ, రాత్రి సమయంలో కొన్ని పండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
మరి ఆ పండ్లు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
కొందరు రాత్రి భోజనం తర్వాత అరటి పండు తింటుంటారు.
వాస్తవానికి మధ్యాహ్నం భోజనం తర్వాత అరటి పండు తీసుకోవచ్చు.కానీ, రాత్రి సమయంలో భోజనం తర్వాత అరటి పండును స్కిప్ చేయడమే మంచిది.
ఎందుకంటే, రాత్రివేళ అరటి పండు తీసుకోవడం వల్ల.ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబు, దగ్గు సమస్యలకు దారితీస్తుంది.
అలాగే యాపిల్‌ను కూడా రాత్రి పూట తినకపోవడమే మంచిది.ఎందుకంటే, యాపిల్ పండులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
![Telugu Apple, Banana, Effects Fruits, Fruits, Tips, Latest, Orange-Telugu Health Telugu Apple, Banana, Effects Fruits, Fruits, Tips, Latest, Orange-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2020/12/night-food-latest-news-health-tips.jpg )
దాంతో ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.యాపిల్‌లో బోలెడన్ని పోషకాలతో పాటు పలు ఆమ్లాలు కూడా ఉంటాయి.ఎసిడిటీ సమస్య ఉన్న వారికి ఆ ఆమ్లాలు కూడా తోడైతే రాత్రిపూట మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇక రాత్రి వేళ బత్తాయి పండు, కమలా పండు, నారింజ పండు వంటి సిట్రిక్ ఆమ్లాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదు.
అలాగే చాలా మంది రాత్రి పూట మామిడి పండ్లు తింటుంటారు.కానీ, మామిడి పండ్లు కూడా రాత్రి వేళ తీసుకోరాదు.
ఎందుకంటే, అందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు నిద్రను కూడా పాడుచేస్తుంది.ఇక ద్రాక్ష పండ్లు కూడా రాత్రి పూట తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.