ఎందుకంటే, రాత్రివేళ అరటి పండు తీసుకోవడం వల్ల.ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబు, దగ్గు సమస్యలకు దారితీస్తుంది.
అలాగే యాపిల్‌ను కూడా రాత్రి పూట తినకపోవడమే మంచిది.ఎందుకంటే, యాపిల్ పండులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
"""/"/
దాంతో ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
యాపిల్‌లో బోలెడన్ని పోషకాలతో పాటు పలు ఆమ్లాలు కూడా ఉంటాయి.ఎసిడిటీ సమస్య ఉన్న వారికి ఆ ఆమ్లాలు కూడా తోడైతే రాత్రిపూట మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇక రాత్రి వేళ బత్తాయి పండు, కమలా పండు, నారింజ పండు వంటి సిట్రిక్ ఆమ్లాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదు.
అలాగే చాలా మంది రాత్రి పూట మామిడి పండ్లు తింటుంటారు.కానీ, మామిడి పండ్లు కూడా రాత్రి వేళ తీసుకోరాదు.
ఎందుకంటే, అందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు నిద్రను కూడా పాడుచేస్తుంది.
ఇక ద్రాక్ష పండ్లు కూడా రాత్రి పూట తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
బార్‌టెండర్ అద్భుత ఆవిష్కరణ.. వేసవిలో ఫ్రిడ్జ్ లేకున్నా డ్రింక్స్ చల్లగా.. ఎలాగో మీరే చూడండి!