ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.54
సూర్యాస్తమయం: సాయంత్రం 05.47
రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: రా 12.24 నుంచి 02.46 వరకు
దుర్ముహూర్తం: సా 09.48 నుంచి 10.35 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు…మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.మీరు అనుకున్నది మీకు జరుగుతుంది.
మీరు ఈ రోజు ధనాన్ని పొందగా దానిని దానధర్మాలు చేస్తారు. దీని వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన వల్ల మీకు ఒత్తిడి అవుతుంది.
వృషభం:
ఈరోజు కొన్ని పనులను వాయిదా వేసుకొని…బాగా విశ్రాంతి తీసుకుంటారు.మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.మీకు తెలిసిన వాళ్లు డబ్బులు పొందే మార్గాన్ని చూపిస్తారు.
ఈరోజు మీ పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది.
మిథునం:
మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చినట్లయితే వాళ్ళ నుండి మీ డబ్బులు వసూలు అవుతాయి.మీ ఆఫీసులో మీ తోటి ఉద్యోగులు మీకు సలహాలు ఇస్తారు.దానివల్ల పని కూడా తొందరగా చేస్తారు.వాయిదా వేసిన పనులను ఈ రోజు మొదలు పెడతారు.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.వైవాహిక జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.దానివల్ల ఆనందంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీ స్నేహితుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.ఈ ప్రయోజనం వల్ల అనేక సమస్యల నుండి బయటపడతారు.కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రశంసలు దొరుకుతాయి.
కొన్ని సెమినార్ ల వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీ వ్యక్తిత్వం గురించి మంచిగా చెప్పుకుంటారు.అర్థం చేసుకోకుండా ఉన్న మీ జీవితం… అపార్థాలన్ని తొలగి ఈ రోజు సంతోషంగా ఉంటుంది.
సింహం:
ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పెరిగి కొన్ని ఖర్చుల వలన కూడబెట్టుకోలేకపోతారు.మీరు చేసే పనులల్లో కష్టతత్వం ఉంటుంది.దీని వల్ల మీకు మంచి గుర్తింపు అందుతుంది.
అంతేకాకుండా మీలో విశ్వాసమును పెంచుతుంది.ఈరోజు మీ అభివృద్ధి కూడా పెరుగుతుంది.కొన్ని విషయాల పట్ల ఊహలకందని ఆశల వల్ల మీ భాగస్వామితో గొడవలు అవుతాయి.
కన్య:
ఈరోజు ఆర్థిక లాభాలలో అనుకూలంగా ఉంది.మీ పిల్లల నుండి మీరు ఆనందాన్ని పొందుతారు.మీరు చేసే పనులలో మీరు ఊహించని ప్రశంసలు అందుకుంటారు.
మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారితో ఈ రోజు వాళ్లకి ఎదురుగా పోటీతో ఉంటారు.కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్ల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు.మీ వైవాహిక జీవితంలో కొన్ని విషయాలు సంతోషంగా సాగుతాయి.
తులా:
ఈరోజు మీకు దూర ప్రయాణాలు అనుకూలం గా ఉండవు .కానీ కొన్ని పరిచయాల వల్ల సాగుతుంది.డబ్బుకు సంబంధించిన విషయంలో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు.
డబ్బు విషయంలో తెలిసిన వారి నుండి సహాయం కోరుకుంటారు.మీ మనసులో ఉన్న సమస్యలను దూరంగా పెడుతారు.మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఆనందాన్ని కలిగించే బహుమతి ఇచ్చి మీ ప్రేమను చూపిస్తారు.
వృశ్చికం:
ఈరోజు ఎక్కువగా కాలక్షేపం చేస్తుంటారు.గతంలో జరిగిన అవమానాలను వదులుకోవాలి.ఈరోజు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.
కొన్ని ఆశలు విఫలమైనందుకు మీరు ఇబ్బందికి గురవుతారు.మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు.మీ మనసులో ఉన్న ఇష్టమైన భావాలను మీ భాగస్వామితో తెలుపుతూ…ఆనందంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు ఆర్థిక లాభాలు ఉన్నాయి.మీ కుటుంబ సభ్యుల నుండి ధనాన్ని పొందుతారు.మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.అనుకోని పరిచయం తో మంచి అనుభవం ను తెలుసుకుంటారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మకరం:
ఈరోజు మీ వ్యాపార విషయంలో మీ కుటుంబం కు సంబంధించిన వాళ్లతో జాగ్రత్తగా ఉండండి.లేకుంటే మీకు ఆర్థిక సమస్య ఎదురవుతుంది .ఏదైనా కొత్తగా ప్రాజెక్టును మొదలు పెట్టే ముందు మీ ఇంటి పెద్ద వారితో సమయం కేటాయించి నిర్ణయాలు తీసుకోండి.ఈరోజు మీ ఇంట్లో పండగ వాతావరణం కనబడుతుంది.మీరు చేసే పనులలో మీకు ప్రశంసలు అందుతాయి.
కుంభం:
ఈరోజు మీరు ఇతరులకు ఇచ్చినా డబ్బులు తిరిగి పొందుతారు.అనవసరమైన విషయాలను పట్టించుకోవడం వల్ల వాదనలకు గురవుతారు.దీని వల్ల నష్టం ఎదురవుతుంది.మీ బంధువుల వలన ఆటంకం కలిగి మీరు చేసుకున్న పనులు ఆగిపోతాయి.ఈరోజు మీ వైవాహిక జీవితం విషయంలో ఆలోచించి మాట్లాడండి.మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉంటారు.
మీనం:
ఈరోజు ఆర్థిక విషయంలో మెరుగుదల ఉంటుంది.దీనివల్ల కొత్త వస్తువులు కొనడానికి ఇష్టపడతారు.మీరు చేసే పనులలో ఓర్పుతో, ఓపికతో పని చేస్తే మీకు ప్రశంసలు అందుతాయి.మీ తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి.పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేస్తారు.దీనితో మీకు విజయం లభిస్తుంది.
అధికంగా ఖర్చు చేయడం వల్ల మీ జీవితభాగస్వామితో గొడవలు జరుగుతాయి.
DEVOTIONAL