ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.ఒకటి రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.
గురువారం రోజు స్వామివారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.ఇందులో 24 వేల మంది తలనీలాలను సమర్పించారు.హుండీ ద్వారా 5.7 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో అవి ముగిసిన తర్వాత ఎక్కువ మంది స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని దేవాలయ అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీని తట్టుకునేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
దీంతో టిటిడి ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది.కొత్తగా ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ పెట్టేందుకు నిర్ణయించింది.
దళారీ వ్యవస్థను దూరం చేసేందుకు ఈ ఫేస్ రికగ్నిషన్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.మార్చి ఒకటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ అమల్లోకి తీసుకొని వచ్చింది.
ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ వ్యవస్థ విజయవంతం అయితే తిరుమలలో గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది.రెండో వైకుంఠ కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగంలోకి తీసుకుని వచ్చింది.గదుల కేటాయింపు, లడ్డు ప్రసాదాల కౌంటర్ల వద్ద ఎఫ్ ఆర్టీ యంత్రాలను అమరుస్తున్నారు.
ఇప్పటి నుంచి తిరుపతిలో దళారుల వ్యవస్థ లేకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని దేవాలయ అధికారులు చెబుతున్నారు.ఇన్ని రోజులు దళారులకు అడిగినంత ఇచ్చుకుంటూ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు.ఇకమీద వారి ప్రమేయం లేకుండా చేయాలనే ఆలోచన తో ఇలా చేసింది.ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పేస్ రికగ్నిషన్ త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు తిరుమల దేవస్థానం ప్రణాళికలు చేస్తుంది.
LATEST NEWS - TELUGU