డబ్బింగ్ జానకి తినే కంచాన్ని కాలితో తన్ని అవమానించిన నటి ఎవరు..?

అమ్మ పాత్ర అంటే టక్కున మనకి గుర్తుకు వచ్చే నటి ఎవరన్నా ఉన్నారంటే అది డబ్బింగ్ జానకి అనడంలో అతిశయోక్తి లేదు.ఆమె డబ్బింగ్ చెబితే ఏ నటికైనా అచ్చు అతికినట్లు ఉంటుంది.

 Untold Story About Actress Dubbing Janaki ,  Dubbing Janaki , Artist  Dubbing Ja-TeluguStop.com

భూ కైలాస్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు జానకి గారు.తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు.

అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకుని డబ్బింగ్ అనే పేరునే ఇంటిపేరుగా మార్చుకుని డబ్బింగ్ జానకి గా పేరు గాంచారు.అయితే ఇన్ని సినిమాల్లో నటించి, ఇంతలా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న జానకి ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డారట.జానకి గారు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 60 సంవత్సరాలు దాటింది.16 ఏళ్లకే జానకికి పెళ్లి చేసారు ఆమె తల్లితండ్రులు.పెళ్లి అయిన తర్వాతనే సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించారు.జానకి గారు పెద్దాపురంకు చెందిన ఆవిడ.చాలా మంది గొప్ప నటిగా అనిపించుకోవాలని ఇండస్ట్రీలోకి వస్తూ వుంటారు.కానీ తనకి అలాంటి అసలేమీ లేవని, కేవలం బతుకు తెరువు కోసమే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చేవారు డబ్బింగ్ జానకి.

చిన్నప్పటినుంచి నాటకాలు వేసే అలవాటు ఉండటం మూలంగా సినిమాల మీద ఉన్న ఆసక్తి తో మద్రాసు వచ్చి అక్కడ సినిమాల్లో నటించే అవకాశాలు కోసం ఎదురు చూసింది.అసలు జానకి గారి ఇంటి పేరు కి ముందు డబ్బింగ్ జానకి అనే పేరు ఎలా వచ్చింది అని అడిగితే.

అప్పట్లో జానకి అంటే ఎవరు ఏ ఆర్టిస్టు అని అడిగేవారు అంట.అయితే జానకి డబ్బింగ్ చెప్పటంతో డబ్బింగ్ జానకి అనే పేరు స్థిరపడిపోయింది.అలా అన్ని చోట్ల డబ్బింగ్ జానకి అని రాయటం అలవాటయిపోయింది. గూడచారి వన్ వన్ సెవెన్ తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు.అయితే అప్పుడు శ్రీశ్రీ గారు పిలిచి ఆ సినిమాలో ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పమని అడగటంతో తొలిసారిగా గూడచారి117 సినిమాకి తొలిసారి డబ్బింగ్ చెప్పారు జానకి గారు.అసలు జానకి సినిమా కెరీర్ మొదటగా నటిగానే ప్రారంభమయ్యింది.

భూకైలాస్ సినిమాలో హీరోయిన్ చెలికత్తిగా తన సినీ కెరీర్ మొదలయింది.

Telugu Actress Janaki, Artist Janaki, Janai, Janaki, Untoldstory-Telugu Stop Exc

తరువాత జానకి శంకరాభరణం లో నటించింది.మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.పాత్ర చిన్నది అయినాగానీ పేరు మాత్రం బాగా వచ్చింది.

అలాగే సగర సంగమం సినిమాలో కమల్ హాసన్ కి తల్లిగా నటించారు.అ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోయింది.

ఇండస్ట్రీలో 60 ఏళ్ళ పాటు కొనసాగిన కానీ పెద్దగా ఆస్తులు సంపాదించకపోయిన తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉన్నాయి అంటారు ఆమె.మద్రాసులో ఒక సొంత ఇల్లు ఉంది.అలాగే జానకి గారికి లవకుశ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయిందట.అప్పట్లో చెలికత్తెకి కూడా మేకప్ టెస్ట్ పెట్టేవారట.అయితే కలర్ తక్కువగా ఉన్నానని వద్దు అన్నారట.అ పాత్రలోనే జయంతి గారిని తీసుకున్నారు .ఇప్పటికి అ సినిమా చూసినప్పుడల్లా అయ్యో ఇందులో నేను నటించాలిసింది కదా అని బాధపడేవారట.అంతేకాకుండా నీటిలో దూకడం లాంటి పాత్రలు చేయాలి అంటే భయపడతారంట జానకి.

తాను ఒక సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలు పాత్ర పోషించినప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది అని, అప్పటినుంచి జానకి గారు నీటికి సంబంధించిన సన్నివేశాలలో నటించకూడదు అని నిర్ణయించుకున్నట్లు చెబుతారు.డబ్బింగ్ జానకి గారికి తెలుగు ఇండస్ట్రీ కన్నా తమిళ ఇండస్ట్రీ అంటేనే ఎక్కువ మక్కువ.

ఎందుకంటే తమిళంలోనే తనకి మంచి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయట.అలాగే అక్కడ ఇండస్ట్రీలో చిన్నా పెద్దా నటులు అనే తేడా లేకుండా అందరుతనని గౌరవిస్తారు అని అందుకే తమిళ చిత్రాలే ఎక్కువ సౌఖ్యంగా ఉంటాయని చెబుతారు జానకి.

Telugu Actress Janaki, Artist Janaki, Janai, Janaki, Untoldstory-Telugu Stop Exc

అయితే అప్పట్లో ఒక నటి తాను భోజనం చేయడం కన్నా ముందు జానకి గారు భోజనం చేసారని నానా గొడవ చేసారు కదా.అని ప్రశ్నిస్తే అవును అంటారు ఆమె.ఇప్పుడు అవుట్ డోర్ షూటింగ్ వెళితే ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ ఇస్తున్నారు.అప్పట్లో ఇద్దరు ముగ్గురు తో కలిపి ఒక రూము ఇచ్చేవాళ్ళు.

త్వరగా భోజనం చేసి పడుకోవటం జానకి గారికి అలవాటని, అందుకే త్వరగా భోజనం చేసి పడుకున్నారట.అప్పుడు తనతో పాటు రూమ్ లో ఉన్న నటి తీరిగ్గా వచ్చి జానకి తిన్నదా అంటే తినేసింది అన్నారట.

దానికి ఆవిడకు కోపం వచ్చి జానకి తిన్న తరువాత మిగిలింది నేను తినాలా.అని అక్కడ ఉన్న క్యారేజ్ ని ఒక తన్ను తన్నిందట.దానితో క్యారేజ్ లోని అన్నం అంతా చిందరవందరగా పడిపోయిందట.దాని ఫలితం చివరకు ఆమె అనుభవించిందని ఒకానొక సందర్భంలో తనకి జరిగిన అవమానం గురించి చెప్పారు.

అయితే ఆవిడ పేరు మాత్రం చెప్పలేను అంటారు డబ్బింగ్ జానకి.అయితే ఆవిడ ఇప్పటికి ఇండస్ట్రీలో ఉంది అని చెప్పుకొస్తారు డబ్బింగ్ జానకి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube