కార్తీక మాస అమావాస్య రోజున ప్రతి ఏడాది దీపావళి పండుగను ప్రతి ఒక్కరు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ ఏడాది నేడు గురువారం నవంబర్ 4 వ తేదీ ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోకున్నారు.
దీపావళి పండుగ రోజు ఇల్లు మొత్తం ఎంతో అందంగా దీపాలతో అలంకరించుకొని మన జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగులతో నింపాలని ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు.ఇక ఈ రోజు సాయంత్రం పెద్దఎత్తున అమ్మవారికి పూజ చేసి ఇల్లు మొత్తం చక్కగా దీపాలతో అలంకరిస్తారు.
అయితే దీపావళి రోజు మన ఇంట్లో ఖచ్చితంగా ఈ ప్రదేశాలలో దీపాలను వెలిగిస్తే అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు.మరి ఇంటిలో ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి అనే విషయానికి వస్తే.
దీపావళి రోజు సాయంత్రం ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా దీపాన్ని పెట్టాలి.ఇలా పువ్వులతో అందంగా అలంకరించి దీపాన్ని పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
అలాగే మన ఇంటిలో స్టోర్ రూమ్ లో మనం ధాన్యాలను నిల్వ చేసుకుంటాము కనుక అక్కడ ఒక దీపాన్ని పెట్టడం వల్ల అమ్మ వారు సంతోషించి మనకు ఆహారానికి కొరత లేకుండా కాపాడుతుంది.ప్రతి ఒక్కరు వారి కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా ఐశ్వర్య ప్రాప్తించాలని కోరుకుంటారు.
ఈ క్రమంలోనే డబ్బును నిల్వచేసే చోట ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దీపం పెట్టాలి.

చాలామందికి వాహనాలే ఆస్తిగా ఉంటాయి.కనుక వాహనానికి ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దీపం వెలిగించాలి.అలాగే ఈ సమస్త జీవరాసులకు నీరు ప్రాణాధారం కనుక మన ఇంటి దగ్గర కొళాయి లేదా బావి ఉంటే ఆ బావి దగ్గర దీపం వెలిగించాలి.
అలాగే రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.అలాగే మన ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయంలో దీపాలు వెలిగించాలి అలాగే ఇంటి ఆవరణంలో ఉన్న తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం వల్ల అమ్మవారు సంతోషపడి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళల మనపై ఉంటాయి.