ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘ఆదిపురుష్’ సినిమా ఒకటి.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఎట్టకేలకు ప్రభాస్ నటిస్తున్న తోలి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ ముగించేశారు.
ముంబై లోని సెట్ లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ మొత్తం సంబరాలు జరుపుకుంది.
ప్రభాస్ ఈ సినిమాలో తన పార్ట్ మొత్తం పూర్తి చేసాడు.మిగతా బ్యాలెన్స్ టాకీ పార్ట్ ను నవంబర్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ తన పార్ట్ ను కొన్ని రోజుల క్రితమే పూర్తి చేసింది.ఇంకా రావణాసురిడిగా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పార్ట్ కూడా ముగించేశారు.
ఇక ఇప్పుడు రాముడు పాత్రలో నటిస్తున్న ప్రభాస్ షూట్ కూడా ముగియడంతో వ్రాప్ అప్ పార్టీ చేసుకున్నారు.

ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఎప్పటి నుండో ఈ సినిమా అప్డేట్ ల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూట్ కన్నా కూడా విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి నుండి సమయం అంత దీనికే వినియోగించ బోతున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ సినిమా షూట్ ను తొందరగా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.ఈ ఏడాది లోపే మిగతా టాకీ పార్ట్ కూడా పూర్తి చేస్తే మిగతా సమయం అంత విఎఫ్ఎక్స్ పార్ట్ కు సరిపోతుందని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.మరి చూడాలి ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.