సరైన నిద్ర లేకపోతే ఈ జబ్బుతో చనిపోవడం ఖాయం..!

ఈమధ్య కాలంలో చాలామంది కూడా నిద్రలేమి( Insomnia ) సమస్యలతో బాధపడుతున్నారు.కొంతమందికి సమయం తక్కువగా ఉండటం వలన సరిగ్గా నిద్ర పోలేక పోతారు.

 If You Don't Have Proper Sleep, You Will Surely Die From This Disease , Insomni-TeluguStop.com

కొందరు ఏమో సమయం ఉన్నప్పటికీ కూడా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలా ప్రతిరోజు తగినంత నిద్ర లేకపోవడం వలన మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

అయితే తాజా పరిశోధనల ప్రకారం నిద్రలేమి అనేది కచ్చితంగా క్యాన్సర్ కు కారణం అవ్వచ్చు అని నిపుణులు చెబుతున్నారు.తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనాల్లో ఈ విషయం బయటకు వచ్చింది.

Telugu Cancer, Tips, Insomnia, Prostate Cance-Telugu Health

తక్కువగా నిద్రపోయే వారికి క్యాన్సర్( Cancer ) వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ప్రతిరోజు ఆరు గంటలకు తక్కువగా నిద్రపోతే వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.రాత్రిపూట ఉద్యోగాల కారణంగా చాలామంది మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిద్రపోతూ ఉంటారు.అలాగే పని లేకపోయినా కూడా ఫోన్స్ వాడుతూ చాలామంది రాత్రి 10 నుండి 12 గంటల మధ్యలో నిద్రపోతున్నారు.

మళ్లీ త్వరగా మేల్కొంటున్నారు.కాబట్టి చాలామందికి తగినంత నిద్ర సరిపోవడం లేదు.

అలాగే శరీరంలో సిర్కాడియన్ రిథమ్స్( Circadian Rhythms ) అనీ పిలువబడే 24 గంటల అంతర్గత గడియారం అనేది ఉంటుంది.నిద్రతో పాటు ఎన్నో విధులను వర్తించే ఈ గడియారంలో మార్పు రావడం వలన పెద్ద ప్రేగు, అండాశయా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్( Prostate cancer ) ఇలా చాలా రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక రాత్రి ఉద్యోగాల కారణంగా ఎక్కువ సమయం దాకా మేల్కొని ఉంటారు చాలామంది.కాబట్టి మనం నిద్రించే, అలాగే మేల్కొనే చక్రాల మధ్య మార్పు వస్తుంది.

Telugu Cancer, Tips, Insomnia, Prostate Cance-Telugu Health

ఇలా మార్పు రావడం వలన శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి.కాబట్టి మనం ప్రతి రోజు తగినంత నిద్ర ముఖ్యం.కనీసం రోజుకి ఖచ్చితంగా ప్రతిరోజు ఏడు గంటల పాటు నిద్రపోవాలి.అలాగే నిద్రించే ముందు సెల్ ఫోన్స్ చూడడం, టీవీలు, లాప్టాప్ లు లాంటివి చూడడం తగ్గించాలి.

బెడ్ రూమ్ లో ఖచ్చితంగా నిద్రకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.అలాగే నిద్రపోయే ముందు కెఫిన్ ఉండే పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube