ప్రతి సంవత్సరం నాగుల చవితిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ పండుగలలో నాగుల చవితికి ( Nagula Cavithi )ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ పండుగ సందర్భంగా నాగదేవతలను పూజిస్తూ ఉంటారు.

 Do You Know Why Nagula Chavithi Is Celebrated Every Year, Nagula Cavithi , N-TeluguStop.com

ఈ రోజు ప్రజలు నాగులకు పూజ చేసి వాటి ఆశీర్వాదం తీసుకుంటారు.నాగుల చవితిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్లపక్షం చతుర్ధి రోజు జరుపుకుంటారు.

ఈ సంవత్సరం ఈ పండుగను నవంబర్ 17వ తేదీన జరుపుకున్నారు.ఇంకా చెప్పాలంటే నాగుల చవితి పండుగ నాగదేవతలను పూజించడానికి అంకితం చేయబడిందని పండితులు చెబుతున్నారు.

ఈ రోజు నాగదేవతలను నిష్టగా పూజిస్తారు.పరమేశ్వరుడి మెడలో వాసుకి అనే పాము నివసిస్తూ ఉంటుంది.

అందుకే శివున్ని నాగభూషణం అనే పేరుతో కూడా పిలుస్తారు.విష్ణుమూర్తి( Lord Vishnu ) కూడా శేషనాగు పై సేద తీరుతూ ఉంటాడు.

Telugu Astrology, Devotional, Karthika Masam, Lord Vishnu, Nagadevata, Nagula Ca

అందుకే ఈ దేవుడిని శేషతల్ప సాయిగా పిలుస్తారు. నాగుల చవితి పండుగ( Nagula Chavithi festival )ను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.నాగుల చవితి రోజు మహిళలు నిష్టగా ఉపవాసం ఉంటారు.నాగదేవతను పూలు, పాలతో నియమాల ప్రకారం పూజిస్తారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం నాగులను రాహు గ్రహం అని కూడా అంటారు.మన దేశంలోనీ ప్రజలు పాములను పూజించడం వల్ల పిల్లల శ్రేయస్సు బాగుంటుందని నమ్ముతారు.

అందుకే వివాహం అయిన మహిళలు తమ పిల్లల కోసం నాగ దేవతలను పూజిస్తారు.నిజానికి గ్రామీణ ప్రాంతాలకు పాములు చేసే మేలు ఎంతో ఉంది.

ముఖ్యంగా పంట పొలాలను నాశనం చేసే ఎలుకలను పాములు లేకుండా చేస్తాయి.

Telugu Astrology, Devotional, Karthika Masam, Lord Vishnu, Nagadevata, Nagula Ca

సాధారణంగా పాములు చలికాలంలో బొరియల నుంచి బయటకు వస్తాయి.దీంతో అవి ఎలుకలను తింటాయి.అలాగే మంచి నీరులో హాని చేసే సూక్ష్మజీవులను పాములు తొలగిస్తాయి.

నాగుల చవితి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి నాగదేవత విగ్రహానికి పూజ చేస్తారు.ఈ రోజు నువ్వుల లడ్డులు, బియ్యప్పిండి బెల్లం తో చేసిన తీపి వంటకాలు, పప్పులతో చేసిన వంటకాలను నాగేంద్రుడికి సమర్పిస్తారు.

ఇంకా చెప్పాలంటే నాగేంద్రుడికి ఈ పూజ చేస్తే రాహుకేతువు ప్రతికూల ప్రభావాలు దూరం అవుతాయి.అలాగే పితృ దోషం నుంచి కూడా విముక్తి పొందుతారు.అలాగే సర్ప భయాందోళనలు తొలగిపోతాయి.అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు.

నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరమవుతాయని పండితులు ( Scholars )చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube