తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సలోని( Saloni ).మహారాష్ట్రకు చెందిన అమ్మాయి.
ఈమె అసలు పేరు వందన తన తండ్రి వృత్తిరీత్యా మహారాష్ట్రలో జన్మించిన తిరిగి ముంబైలో పెరిగారు అక్కడే తన విద్యాభ్యాసం మొత్తం జరిగింది.ఇక తన తండ్రికి ఈమె సినిమాలలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఈ విధంగా సలోని సినిమా అవకాశాలతో సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ వచ్చారు.ఇలా తమిళం కన్నడ తెలుగు భాష చిత్రాలలో నటిస్తున్నటువంటి ఈమెకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదని చెప్పాలి.

సలోని ఎన్నో తెలుగు సినిమాలతో పాటు తమిళ కన్నడ సినిమాలలో నటించారు.ఈమె తెలుగులో ఎన్ని సినిమాలలో నటించిన రాని సక్సెస్ రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న ( Maryada Ramanna ) సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు.ఇలా మర్యాద రామన్న సినిమాలో ఈమెను హీరోయిన్గా రాజమౌళి తీసుకోవడానికి కూడా పెద్ద కారణం ఉందని తెలుస్తోంది.మర్యాద రామన్న సినిమాలో కంటే ముందుగానే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర( Magadheera )సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి సలోనికి రాజమౌళి కమెడియన్ సునీల్ ( Sunil ) హీరోగా తెరకెక్కించినటువంటి మర్యాద రామన్న సినిమాలో ఈమెకు హీరోయిన్గా అవకాశం కల్పించారు.ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.సినిమా తర్వాత ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది.ఇలా మర్యాద రామన్న సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సలోని తదుపరి సినిమాలకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేశారు.
ఇలా ఈమె డిమాండ్ చేస్తున్నటువంటి రెమ్యూనరేషన్ నిర్మాతలు కొన్ని సినిమా అవకాశాలను కూడా కోల్పోయారు.

ఇలా ఈమె రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతోనే తనకు అవకాశాలు లేవని తద్వారా ఈమె మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చారని తెలుస్తుంది.రాజమౌళి ప్రత్యేకంగా ఈమెను హీరోయిన్గా తీసుకోవడం వెనుక కూడా పెద్ద కారణం ఉంది.ఈమె స్వయాన రాజమౌళికి బంధువులు కావడంతోనే తనని హీరోయిన్గా సినిమాలో తీసుకున్నారని తెలుస్తోంది.
మరి సలోని రాజమౌళికి ఏ విధంగా బంధువు అనే విషయానికి వస్తే… రాజమౌళి అన్నయ్యగా భావించే ఎంఎం కీరవాని( MM Keeravani ) కి సలోని దగ్గరి బంధువులట.కీరవానికి చుట్టాలు కావడంతోనే రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో తనకు అవకాశం కల్పించారని అయితే ఈమె మాత్రం ఆ సక్సెస్ ను తదుపరి సినిమాలకు ఉపయోగించుకోలేకపోయారని తెలుస్తుంది.








