కుటుంబంలోని సభ్యుల మధ్య రకరకాల సంబంధాలు ఉంటాయి.భార్యాభర్తలు, తోబుట్టువులతో సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య బంధాలు ఉంటాయి.
అయితే భార్య భర్తల బంధంతో సహా ప్రతి బంధం లో హెచ్చుతగ్గులు ఉంటాయి.వాస్తవానికి కుటుంబంలో భిన్నభిప్రాయాలు సహజమే అయినప్పటికీ అభిప్రాయ భేదాలు సర్వసాధారణంగా చోటు చేసుకుంటాయి.
కొన్నిసార్లు కుటుంబ జీవితంలో( Family Life ) ఎదురయ్యే అవంతరాలకు ఇంట్లో వాస్తు దోషలు కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా కుటుంబంలో బలమైన బంధాన్ని కొనసాగించడానికి కొన్ని చిట్కాలను చెబుతున్నారు.
బలమైన కుటుంబ సంబంధాల కోసం ఈ వాస్తు చిట్కాలను పాటించడం ఎంతో మంచిది.

వాస్తు ప్రకారం( Vastu ) భార్యాభర్తలు ఆగ్నేయ దిశకు ఎదురుగా ఉన్న గదిలో ఉండకూడదు.ఇది భార్యాభర్తల మధ్య సంబంధానికి హాని కలిగించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే పడకగదిలో ఎప్పుడూ లేత రంగులు వాడడం మంచిది.
మీ ఇంటి లోపల చిందరవందరంగా ఉండకూడదు.అంతేకాకుండా ఇంట్లోనీ వ్యక్తుల మధ్య ఎప్పుడూ వివాదాలు ఏర్పడతాయి.
దంపతులు తమ పడకగది( Bed Room astu )లో నిదురిస్తున్న సమయంలో ఆ గది తలుపులు మూసి ఉంచాలి.వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రేమ, మృదువైన సంబంధం నేలకొనాలంటే మంచానికి భర్త కుడి వైపున పడుకుంటే, భార్య మంచం ఎడమవైపున నిద్రపోవడం మంచిది.

ఫ్యామిలీ ఫోటో( Family Photo Vastu )ను గది నైరుతి దిశలో ఉంచాలి.ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులు పొరపాటున కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు.ఇంటి గోడపై ఏవైనా పగుళ్లు ఉంటే మీరు వాటిని వీలైనంత త్వరగా సరి చేయాలి.గోడల పగుళ్లు( Cracks on Walls ) తోబొట్టుల మధ్య కమ్యూనికేషన్ సమస్యకు దారి తీయవచ్చు.
ఇంట్లో ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల చాలా సానుకూల శక్తి లభిస్తుంది.ఇది సంబంధాలు, కుటుంబ బంధాలు వృద్ధి చెందడానికి చాలా మంచిది.ఇంటి ఉత్తర ప్రాంతంలో పచ్చని మొక్కలను నాటడం మంచిది.మొక్కలు కుటుంబంలో విశ్వాసం, ప్రేమను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.