ముఖ్యంగా చెప్పాలంటే పూజలు, వ్రతాల్లో ఆచమానం( Achamanam ) అనే మాట చాలా సార్లు వింటూ ఉంటాం.కానీ ఆ పదానికి అర్థం.
అసలు అలా ఎందుకు చేయాలి.అనే విషయం చాలామందికి తెలియదు.
అందుకే అచమానం అంటే ఏమిటో దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆచమానం అనే ఆచారం అపరిమితమైనది.
ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజకు( Pooja ) ముందు సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్లి వచ్చిన తర్వాత ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్న తర్వాత ఆచమానం చేయవచ్చు.ఆచమానం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి.

ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకొని తాగాలి.ఆచమానం గురించి సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్ అని వర్ణించారు.అంటే కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి ఇందులో మూడు ఉద్ధరణి ల నీటిని పోసి ( Water ) వాటిని తాగాలి.చేతిలో పోసే నీళ్లు అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు.
ఆచమానం ఎన్నిసార్లు అయినా చేయవచ్చు.ఆచమానం చేసేటప్పుడు కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అని మాత్రమే ఎందుకు చెప్పాలి.
ఇలాంటి ఎన్నో లెక్కకు మించిన సందేహాలు చాలామందికి ఉంటాయి.

పైగా దేవుడు ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహస్యం చేస్తారు.అందుకే అచమానం చేయడంలో పరమార్థం ఏమిటో తెలుసుకొని చేయాలి.మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి.
దీన్ని స్వరపేటిక అని అంటారు.దీనీ చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది.
కాబట్టి కొంతవరకు రక్షణ లభిస్తుంది.అయినప్పటికీ ఇది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది.
ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదం స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు.ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఉద్ధరణి కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల కొద్దిపాటి విద్యుత్తు పెదాలు, నాలుక, గొంతు, పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.