హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకి మతపరమైన ప్రాముఖ్యత ఉంది.వారంలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయిస్తారు.
గురువారం విష్ణువుకు అంకితం చేయబడిన రోజు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.గురువారం శ్రీమహావిష్ణువును( Maha vishnu) పూజించి, ఉపవాసం ఉన్నవారికి అన్ని రకాల సమస్యలు దూరమైపోతాయని ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా గురువారం పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు.ఇలాంటి పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు( Financial problems ) తప్పవు అని పండితులు చెబుతున్నారు.

గురువారం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది.ఈ నేపథ్యంలో గురువారం రోజున చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం రోజున దుస్తులను ఉతకకూడదు.అలాగే మాసిన బట్టలు ఉతకడానికి ఇవ్వకూడదు.ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది.ఇంటిని గురువారం నీటితో శుభ్రం చేయరాదు.
గురువారం తడి బట్ట వేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం పై చెడు ప్రభావం చూపుతుంది.

అలాగే లక్ష్మీదేవి( Lakshmi Devi )కి కోపం వస్తుందని ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మహిళలు తలకు షాంపూ వాడరాదు.గురువారం రోజు తలంటూ పోసుకునే వారి జాతకంలో కుజుడు బలహీనుడు అవుతాడు.
అలాగే గురువారం రోజు చేతుల, కాళ్ళ గోళ్లను కత్తిరించుకోకూడదు.ఈ నియమాలు పాటించని వారి ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.
అలాగే గురువారం రోజు జుట్టు కత్తిరించడం కూడా తప్పుగా భావిస్తారు.ఇలా చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని, డబ్బుకు కొరతా ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతారు.
గురువారం రోజు అరటిపండు తినకూడదు.మహావిష్ణువు ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున అరటి చెట్టును పూజించాలి.
అలాగే గురువారం రోజు మద్యం, మాంసం, వెల్లుల్లి, ఉల్లి( onion ) వంటి తామసిక ఆహారం అసలు తీసుకోకూడదు.ఇంకా చెప్పాలంటే గురువారం రోజు పదును వస్తువులను కొనకూడదు.
ఇలా చేయడం వల్ల డబ్బుకు ఎన్నో రకాల సమస్యలు ఏర్పడవచ్చు.