సాధారణంగా చాలా మంది పాదాలను పెద్దగా పట్టించుకోరు.పాదాల సంరక్షణపై అసలు శ్రద్ద అనేదే పెట్టరు.
కానీ, మన జీవన విధానంలో పాదాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.అటువంటి పాదాలను జాగ్రత్తగా తీసుకోవడం ఎంతో అవసరం.
అయితే ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందుకు పాదాలకు ఆయిల్ రాసికాసేపు మసాజ్ చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో ఎందరినో నిద్ర లేమి సమస్య తీవ్రంగా వేధిస్తుంది.ఈ సమస్య క్రమంగా కొనసాగితే ఆరోగ్యం దెబ్బ తినడమే కాదు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే నిద్ర లేమిని నివారించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.అయితే ఇలాంటి రాత్రి నిద్రించే ముందు పాదాలకు కొబ్బరి నూనె అప్లై చేసి ఐదు నిమిషాల పాటు వేళ్లతో మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
నిద్రలేమి దూరం అవుతుంది.
అలాగే ప్రతి రోజు పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె అప్లే చేసి కాసేపు మసాజ్ చేసుకుంటే ఒత్తిడి, అలసట, ఆందోళన, తలనొప్పి సమస్యలు దూరం అవుతాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది.మనసు ఉల్లాసంగా మారుతుంది.
శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
పాదాలకు ఆయిల్ రాసి మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఫలితంగా పాదాల వాపు సమస్య దూరం అవుతుంది.అలాగే రాత్రి పూట పడుకునే ముందు నూనె రాస్తే పాదాలలో తేమ విచ్ఛిన్నమవుతుంది మరియు చర్మం ఎండి పోకుండా చేస్తుంది.
దాంతో పగుళ్లు, పాదాలలో మంట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.ఇక చాలా మంది తమ పాదాలు నల్లగా ఉన్నాయని బాధ పడుతుంటారు.
అయితే ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు పాదాలకు ఆయిల్ రాసుకుంటే క్రమంగా తెల్లగా మరియు మృదువుగా మారతాయి.