సాధారణంగా కొందరి ముఖం ఎంతో తెల్లగా, కాంతివంతంగా ఉంటుంది.కానీ, మెడ మాత్రం నల్లగా అగ్లీగా ఉంటుంది.
దాంతో అందహీనంగా కనిపిస్తారు.సరైన కేర్ తీసుకోకపోవడం, ఎండ ప్రభావం, మాయిశ్చరైజర్ ఎవైడ్ చేయడం, డెడ్ స్కిన్ సెల్స్, శరీర వేడి ఇలా రకరకాల కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంది.
అయితే ఈ సమస్యను నివారించుకునేందుకు బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బు తగలేస్తుంటారు.కానీ, న్యాచురల్‌గానే మెడ నలుపును నివారించుకోవచ్చు.
ముఖ్యంగా ఆరెంజ్ పీల్‌తో మెడను తెల్లగా, అందంగా మార్చుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్ పీల్‌ను తీసుకుని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో ఆరెంజ్ పీల్ పౌడర్, నిమ్మ రసం, పెరుగు మరియు చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమానికి మెడకు అప్లై చేసి అర గంట పాటు ఆరనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే.నల్లని మెడ క్రమంగా తెల్లగా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఆరెంజ్ పీల్ పౌడర్, గంధపు పొడి మరియు రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకోవాలి.బాగా డ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లి.రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.

ఇక బౌల్‌లో ఆరెంజ్ పీల్ పౌడర్, తేనె మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి.ఇరవే లేదా ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం చల్లటి నీటితో మెడను శుభ్రం చేసుకోవాలి.వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే మెడ నలుపు పోయి అందంగా మారుతుంది.