అమ్మ బాబోయ్.. రోజుకు ఒక సపోటా పండును తింటే ఇన్ని జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చా..?

సపోటా( Sapota fruit).చాలా మందికి ఇష్టమైన పండ్లలో ఒకటి.

 Wonderful Health Benefits Of Eating Sapota Regularly! Sapota, Sapota Health Bene-TeluguStop.com

ధర తక్కువే అయినప్పటికీ సపోటా పండ్లు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.అలాగే ఎన్నో విలువైన పోషకాలు సపోటా పండు లో నిండి ఉంటాయి.

విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్.ఇలా ఎన్నో పోషకాలు సపోటాలో ఉంటాయి.

నిజానికి రోజుకు ఒక సపోటా పండును తీసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.అనేక జ‌బ్బుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంలో స‌పోటా అద్బుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును నోట్లో వేసుకోగానే కరిగిపోయే సపోటా పండు శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.బాడీని డీటాక్స్ చేస్తుంది.అలాగే చాలా మంది రక్తహీనత సమస్యతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.అలాంటి వారికి సపోటా పండు చాలా మేలు చేస్తుంది.

రోజుకు ఒక సపోటా పండును తీసుకుంటే అందులో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.దాంతో రక్తహీనత దూరం అవుతుంది.

Telugu Cancer, Chikoo Fruit, Tips, Latest, Sapota, Sapota Benefits-Telugu Health

సపోటా పండులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కంటి చూపును రెట్టింపు చేస్తుంది.సపోటా పండులో ఉండే పలు సుగుణాలు లివర్ ను శుభ్రంగా మారుస్తాయి.ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి.రోజుకు ఒక సపోటా పండును తీసుకుంటే జీర్ణవ్యవస్థ( Digestive system ) చురుగ్గా పని చేస్తుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.

Telugu Cancer, Chikoo Fruit, Tips, Latest, Sapota, Sapota Benefits-Telugu Health

అంతేకాదండోయ్‌.రోజుకు ఒక సపోటా పండును తింటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. క్యాన్సర్( Cancer ) వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.ఎముకలు సైతం దృఢంగా ఉంటాయి.కాబట్టి ఇన్ని ప్రయోజనాలను అందించే సపోటా పండును తప్పకుండా డైట్ లో చేర్చుకోండి అయితే.

మధుమేహం ఉన్నవారు మాత్రం సపోటా పండును తీసుకోరాదు.ఎందుకంటే, స‌పోటా పండు బ్లెడ్ షుడ్స్ లెవ‌ల్స్ ను అమాంతం పెంచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube