Kangana Aaliya Siddiqui: కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆలియా సిద్ధిఖీ.. కారణం అదే?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌( Kangana Ranaut ) గురించి మనందరికీ తెలిసిందే.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కంగనా రనౌత్‌.

 Aaliya Siddiqui Says Kangana Ranaut Words Against Her Hold No Value-TeluguStop.com

సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అలాగే సినిమాలకు సంబంధించిన వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తూ లేని పోనీ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తరచూ ఏదో విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్‌.

ఇది ఇలా ఉంటే కంగనాపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ,( Nawazuddin Siddiqui ) సతీమణి ఆలియా( Aaliya Siddiqui ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telugu Aaliya Siddiqui, Kanganaaliya, Kangana Ranaut, Siddiqui, Tiku Weds Sheru,

అందరి విషయాల్లో తలదూర్చే వ్యక్తినే కంగనా రనౌత్‌ అంటారంటూ వ్యంగ్యాస్త్రాలు చేసింది.ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కంగనా రనౌత్‌ గురించి మాట్లాడుతూ.కంగనా వ్యాఖ్యలను నేను అస్సలు పట్టించుకోను.

నా జీవితంలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వను.ఆమె తరచూ అందరి విషయాల్లో జోక్యం చేసుకొని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది.

నా దృష్టిలో ఆమెవి అర్థం లేని మాటలు.కంగన నిర్మించిన టీకూ వెడ్స్‌ షేరు సినిమాలో నవాజుద్దీన్‌ నటించారు.

Telugu Aaliya Siddiqui, Kanganaaliya, Kangana Ranaut, Siddiqui, Tiku Weds Sheru,

తన సినిమాని దృష్టిలో ఉంచుకునే ఆమె నవాజుద్దీన్‌కు సపోర్ట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.కాబట్టి, ఆమె మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తెలిపింది ఆలియా.ఇంటర్వ్యూలో భాగంగా ఆలియా,కంగనా పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.ఈ వాఖ్యలపై కంగనా రనౌత్‌ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఇకపోతే నవాజుద్దీన్‌ – ఆలియా ల విషయానికి వస్తే.గత కొంతకాలంగా వీరి వైవాహిక బంధంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

కొన్ని నెలల క్రితం వీరిద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలోనే ఆలియా నవాజుద్దీన్‌కు దూరంగా ఉంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube