కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) టైం అస్సలు బాలేదు.ఖలిస్తాన్ వేర్పాటువాదులకు అండగా నిలిచిన ఆయన కోరి ఇండియాతో పెట్టుకుని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు.
ఇక సొంత ప్రభుత్వం నుంచి నిరసన సెగతో అవిశ్వాస తీర్మానాన్ని సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.మరోవైపు.
కొద్దినెలల్లో జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ,( Liberal Party ) ట్రూడోకు వ్యతిరేకంగా ఓపీనియన్ పోల్స్ వస్తుండటంతో ప్రధానిని తీవ్రంగా భయపెడుతున్నాయి.
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా తాజాగా కెనడా ఆర్ధిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్( Chrystia Freeland ) సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతో ట్రూడో పరిస్ధితి దారుణంగా తయారైంది.
విధానపరమైన సంఘర్షణ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.తొమ్మిదేళ్లు కెనడాను ఏకఛత్రాధిపత్యం కింద ఏలుతున్న ట్రూడోకు తాజా సంక్షోభం తర్వాత ప్రధానిగా తప్పుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
అంతేకాదు.ఆయనను రాజ్యాంగం ప్రకారం పదవి నుంచి తప్పిస్తారా అనే కథనాలు సైతం వస్తున్నాయి.
కెనడాలో అంతిమ రాజ్యాంగ అధికారం గవర్నర్ జనరల్ మేరీ సైమన్‌కు ఉంది.ఆమె దేశాధినేత అయిన కింగ్ చార్లెస్ వ్యక్తిగత ప్రతినిధి.సిద్ధాంతాల ప్రకారం ఆమె ట్రూడోను తొలగించగలదు.కానీ నిజ జీవితంలో ఇది జరగాలంటే చాలా కష్టం అంటున్నారు ఒట్టావాలోని కార్లెటర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజ్యాంగ నిపుణుడు ఫిలిప్ లగాస్సే.
హౌస్ ఆఫ్ కామన్స్ విశ్వాసాన్ని ఇప్పటికీ కలిగి ఉన్న ప్రధాని ట్రూడోను గవర్నర్ జనరల్ తొలగించలేరని చెప్పారు.
హౌస్‌లో మైనారిటీలో ఉన్న ట్రూడోకు న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) మద్ధతుగా ఉన్న సంగతి తెలిసిందే.లిబరల్స్‌ను పోలి ఉండే రాజకీయాలు చేస్తున్న జగ్మీత్ సింగ్ సైతం ట్రూడోను పదవి నుంచి తప్పించాలనే ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు.అయితే ఇప్పటికప్పుడు కెనడాలో ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్‌ల చేతిలో అణిచివేయబడటం ఖాయమని నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జస్టిన్ ట్రూడోకు అండగా నిలబడటమే మంచిదనే ఉద్దేశంలో జగ్మీత్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.