టాలీవుడ్ సినీ అభిమానులు మోక్షజ్ఞ( Mokshagna ) సినీ ఎంట్రీ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిందని వార్తలు వినిపించాయి.
అయితే మోక్షజ్ఞ నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో నటిస్తారంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువ సినిమాలే అయినా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.
నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి సీక్వెల్ తో( Kalki Sequel ) బిజీగా ఉన్నారు.కల్కి సీక్వెల్ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో నాలుగు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
అయితే మోక్షజ్ఞ సినిమాకు దర్శకత్వం వహించడానికి నాగ్ అశ్విన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

మోక్షజ్ఞ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో కూడా సినిమా రానుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మోక్షజ్ఞ రెమ్యునరేషన్( Mokshagna Remuneration ) 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మోక్షజ్ఞ మీడియాకు దూరంగా ఉండటం వల్ల కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మోక్షజ్ఞ అద్బుతమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.
నందమూరి మోక్షజ్ఞ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.