వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు కీలక హోదాలను చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక అమెరికా వేదికగా జరిగే అందాల పోటీలలోనూ భారతీయ మగువలు సత్తా చాటుతున్నారు.తాజాగా న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో భారత సంతతికి చెందిన అమెరికన్ టీనేజర్ కైట్లిన్ సాండ్రా( Caitlin Sandra ) ‘‘మిస్ ఇండియా యూఎస్ఏ 2024 ’’( Miss India USA 2024 ) కిరీటాన్ని గెలుచుకున్నారు.
19 ఏళ్ల సాండ్రా .తమిళనాడులోని చెన్నైలో( Chennai ) పుట్టారు.ప్రస్తుతం డేవిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో( California University ) సెకండియర్ చదువుతున్నారు.
తన కమ్యూనిటీపై సానుకూల శాశ్వత ప్రభావాన్ని చూపాలని అనుకుంటున్నానని, మహిళా సాధికారత, అక్షరాస్యతపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని సాండ్రా వెల్లడించారు.ఆమె దాదాపు 14 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తుండగా.
వెబ్ డిజైనర్( Web Designer ) కావాలన్నది సాండ్రా కల.దీనితో పాటు మోడలింగ్, నటిగానూ రాణించాలని అనుకుంటున్నట్లు సాండ్రా తెలిపారు.
ఇండియా ఫెస్టివల్ కమిటీ (ఐఎఫ్‌సీ) నిర్వహించిన పోటీలలో ఇల్లినాయిస్‌కు చెందిన సంస్కృతి శర్మ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరిటాన్ని.వాషింగ్టన్‌కు చెందిన అర్షితా కథ్‌పాలియా మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ను గెలుచుకున్నారు.మిస్ ఇండియా యూఎస్ఏ 2023 విజేత రిజుల్ మైనీ, మిసెస్ ఇండియా యూఎస్ఏ 2023 విజేత స్నేహ నంబియార్‌లు కైట్లిన్ సాండ్రా నీల్, సంస్కృతి శర్మలకు కిరీటాన్ని అందించారు.మిస్ ఇండియా యూఎస్ఏ పోటీలో ఇల్లినాయిస్‌కు చెందిన నిరాలీ దేశియా ఫస్ట్ రన్నరప్‌గా .న్యూజెర్సీకి చెందిన మణిని పటేల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు.
ఇక మిసెస్ ఇండియా యూఎస్ఏ పోటీలో వర్జీనియాకు చెందిన సప్నా మిశ్రా, కనెక్టికట్‌కు చెందిన చిన్మయి అయాచిత్‌లు ఫస్ట్, సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.మిస్ ఇండియా టీన్ విభాగంలో రోడ్ ఐలాండ్‌కు చెందిన ధృతి పటేల్ ఫస్ట్ రన్నరప్‌గా, సోనాలి శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.అమెరికాలోని 25 రాష్ట్రాల నుంచి 47 మంది పోటీదారులు మూడు విభాగాలలో పోటీపడ్డారు.