టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu Arjun ) ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.అయితే బెయిల్ పై విడుదలైన తర్వాత చిరంజీవి, నాగబాబులను కలిసిన బన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) కూడా కలిసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ ద్వారా బన్నీ పవన్ ను కలవాలని ప్రయత్నించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
బన్నీని కలవడానికి పవన్ నో చెప్పలేదు కానీ ఆశించిన రెస్పాన్స్ అయితే రాలేదని సమాచారం అందుతోంది.
బన్నీ పవన్ ను కలిసి ఫోటో దిగితే అల్లు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఉండే గ్యాప్ కొంతమేర తగ్గే అవకాశం ఉంది.పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ బ్రేక్ ఈవెన్ కు మరో 20 కోట్ల రూపాయల దూరంలో ఉండగా ఈ వారం కలెక్షన్లతో సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలో మాత్రం పుష్ప2 దేవర సాధించిన రికార్డులను బ్రేక్ చేయలేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.పుష్ప ది రూల్ కు బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.ఈ నెల 20వ తేదీన పలు క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య సైతం తగ్గనుంది.మరోవైపు బన్నీ బెయిల్( Bunny Bail ) రద్దు కావచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

బన్నీ బెయిల్ విషయంలో తెలంగాణ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు బన్నీ రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో బన్నీ వివాదం విషయంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.