అమీబియాసిస్.వ్యాధి.
వినడానికే చాలా కొత్తగా ఉంది అనుకుంటున్నారా అవును మనకి తెలిసిన సాధారణ రోగాలని మాత్రమే కాకుండా మనకు తెలియని వాటిగురించి తెలుసుకోవడం వలన మనం మరింత ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం.అమీబియాసిస్ అనేది శరీరంలో ఉండే పేగులలో ఏర్పడే ఓక్ ఇన్ఫెక్షన్ వలన వచ్చే రోగం.
ఈ వ్యాధి ఒక సూక్ష్మ క్రిమి ద్వారా వస్తుంది.ఈ సమస్యకి ప్రధాన కారణం ఏమిటంటే ముఖ్యంగా అపరిశుభ్రత.
కలుషిత నీళ్ళు,పానీయాలు,సేవించడం వలన ఇది తొందరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి రావడానికి కారణం అయ్యే అమీబా క్రిములు శరీరంలో ప్రేగులలోని గోడలలో చేరి అక్కడ పుండు చేస్తాయి.
ఆ తరువాత అవి అనేకరకాలుగా ఎక్కువ సంఖ్యలో వ్యాప్తి చెందుతాయి.ఇవి మనం విసర్జించే మలం ,ఉమ్మి ల ద్వారా ఇతరులకి వ్యాప్తి చెందుతాయి.ఈ అమీబియాసిస్ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అని కూడా అంటారు.ఈ వ్యాధి బారిన పడినవాళ్ళు రక్తం తో కూడిన జిగట విరోచనాలు అవుతుంటాయి.
మలం చలా దుర్వాసన వస్తుంది.
రోడ్డు సైడ్ అమ్మే ఆహార పదార్ధాలు తినడం వలన కూడా ఈ వ్యాధి సోకే అవకాసం ఉంది.దుకాణదారుడు తానూవండే పదార్ధాలు శుబ్రంగా వండుతాడో లేదో తెలియదు.ఆహార పదార్ధాలు ఉడికించడం వలన ఈ బ్యాక్టీరియ నాశనం అవుతుంది.
కానీ చట్నీలు చేసేటప్పుడు కూరగాయలని ఉడికించరు దాని వలన అమీబా శరీరంలోకి ప్రవేసించే అవకాసం ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ నీటిని త్రాగేస్తూ ఉంటారు.
ఇది కూడా అమీబియాసిస్‌కు దారితీస్తుంది.ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ శరీరంలోకి వెళ్తే ఊపిరితిత్తుల్లో కూడా కురుపు ఏర్పడవచ్చు.
మరికొన్ని సార్లు గుండె పై భాగానికి, మెదడుకు, వెన్నెముకకూ సోకి మెనెంజైటిస్ సమస్య తలెత్తవచ్చు.అందుకే ఈ వ్యాధి సంభందిత లక్షణాలు ఏమి ఉన్నా సరే పరీక్ష చేయించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.